నట్టల నివారణ మందు వేయించాలి

ABN , First Publish Date - 2020-12-03T05:13:08+05:30 IST

మేకలు, గొర్రెలలో వచ్చే నట్టల నివారణ వ్యాధి నిర్మూలన కోసం టీకా మందులను వేయించాలని జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి అన్నారు.

నట్టల నివారణ మందు వేయించాలి
తలమడుగులో మేకలకు నట్టల నివారణ మందును వేస్తున్న జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి

తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి

తలమడుగు, డిసెంబరు 2: మేకలు, గొర్రెలలో వచ్చే నట్టల నివారణ వ్యాధి నిర్మూలన కోసం టీకా మందులను వేయించాలని జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సుంకిడి, సాయిలింగి గ్రామాల్లో మేకల, గొర్రెల నట్టల నివారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ మేకలు, గొర్రెలు పెంపకం చేసే కాపలదారులు తప్పకుం డా వాటికి వ్యాధి నిరోధక టీకాలను వేయించాలన్నారు. అదే విధంగా పశువులకు ఎలాంటి వ్యాధులు వ్యాపించిన వెంటనే పశువైద్య సిబ్బందిని సంప్రదించాల న్నారు. మేకల, గొర్రెల పెంపకంతో రైతులు మరింత ఆర్థికాభివృద్ధి చెందుతార న్నారు. ఇందులో మండల పశువైద్యాధికారి దూద్‌రాంరాథోడ్‌, లింగి సర్పంచ్‌ జంగాల రేవతి,  సుంకిడి సర్పంచ్‌ మహేందర్‌యాదవ్‌, ఎంపీటీసీ గెల్ల వెంకన, గొర్రెలు, మేకల పెంపకందారులు, తదితరులు పాల్గొన్నారు. 

గుడిహత్నూర్‌: పశు పోషకులు తమ మేకలకు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేయించాలని మండల పశువైద్యాధికారి డా.రాథోడ్‌ జీవన్‌ అన్నారు. నట్టల మందు పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని సీతా గొందీ, కమలపూర్‌లో మేకలకు గొర్రెలకు సర్పంచ్‌లు మడావి ధనలోఇ్మ, ప్రేమ లత, ఎంపీటీసీ చిట్యాల కృష్ణవేణిలు వేసి ప్రారంభించారు. మొత్తం 1672 మేక లు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేసినట్లు పశువైద్యాధికారి తెలిపారు.

భీంపూర్‌: మండలంలోని పిప్పల్‌కోటి, గొల్లఘడ్‌, తాంసి(కె) గ్రామాలలో బుధవారం గొర్రెలు, మేకలకు వైస్‌ ఎంపీపీ గడ్డంలస్మన్న మండల పశువైద్య అధి కారి రాథోడ్‌సుభాష్‌లు నట్టల నివారణ మందును అందజేశారు. పశుపోషకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కేమ కళ్యాణిగంగయ్య, సయ్యద్‌ కరీం, నైతం రవీందర్‌. తదితరులున్నారు. 

బోథ్‌: రైతులు గొర్రెలు, మేకల కాపరులు తాము పెంచుకుంటున్న మేకలు, గొర్రెలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని బోథ్‌ పట్టణ సర్పంచ్‌ సురేందర్‌ యాదవ్‌ కోరారు. బుధవారం బోథ్‌లో మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు లను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు వ్యాధుల నివారణకు గాను మందులను  వ్యాక్సిన్‌లను వేయడం జరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి శ్రావన్‌నాయక్‌, సిబ్బంది ఎం.తేజస్వి ని, మహేష్‌, వంజరి, విశ్వనాథ్‌, తదితరులు పాల్గొన్నారు. 

పెంబి: పశువులకు నట్టల మందు తప్పనిసరిగా వేయించాలని వైస్‌ ఎంపీపీ గంగారెడ్డి, సర్పంచ్‌ సుధాకర్‌ అన్నారు. బుధవారం మండలంలోని మందపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి విజయ్‌, తదితరులు ఉన్నారు.

లోకేశ్వరం:  మండలంలోని సాత్‌గాం, బిలోలి గ్రామాల్లో బుధవారం నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. సందర్భంగా పశువైద్యాధికారి జెస్సీ మా ట్లాడుతూ ప్రభుత్వం మేకలు, గొర్రెలకు ఉచితంగా టీకాలను పంపిణీ చేస్తుందని, పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో సర్పంచులు సవితి, భోజవ్వ, పశువైద్య సిబ్బంది సాయన్న, రాజు, మహేందర్‌, గంగాధర్‌లున్నారు.

Updated Date - 2020-12-03T05:13:08+05:30 IST