వేసవిలో ఇంట్లోనే సహజసిద్ధంగా ఇవి తయారుచేసుకుంటే..

ABN , First Publish Date - 2022-04-06T17:02:38+05:30 IST

చర్మ సౌందర్యం కోసం ఫేస్‌ప్యాక్‌ ఉపయోగిస్తుంటారు. అయితే వేసవిలో ఇంట్లోనే సహజసిద్ధంగా ఫేస్‌ప్యాక్‌లు తయారుచేసుకుని ఉపయోగించడం మేలు. అలాంటి కొన్ని ఫేస్‌ప్యాక్‌లు ఇవి...

వేసవిలో ఇంట్లోనే సహజసిద్ధంగా ఇవి తయారుచేసుకుంటే..

ఆంధ్రజ్యోతి(06-04-2022)

చర్మ సౌందర్యం కోసం ఫేస్‌ప్యాక్‌ ఉపయోగిస్తుంటారు. అయితే వేసవిలో ఇంట్లోనే సహజసిద్ధంగా ఫేస్‌ప్యాక్‌లు తయారుచేసుకుని ఉపయోగించడం మేలు. అలాంటి కొన్ని ఫేస్‌ప్యాక్‌లు ఇవి...


అరటి పండు - ఆరెంజ్‌ మిక్స్‌ చేసి...

ఆయిలీ స్కిన్‌, త్వరగా డీహైడ్రేట్‌ అయ్యే చర్మం ఉన్న వారికి ఈ న్యాచురల్‌ ఫేస్‌ ప్యాక్‌ బాగా పనికొస్తుంది. ముఖంపై తాజా మెరుపునిస్తుంది. అరటిపండును గుజ్జుగా చేసుకోవాలి. తరువాత అందులో ఆరెంజ్‌ జ్యూస్‌, తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి రాసుకుని పావుగంట పాటు వదిలేయాలి. తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. 


వాటర్‌మెలన్‌, పెరుగు కలిపి...

తాజా పెరుగు చర్మానికి మృదుత్వాన్నిస్తుంది. వాటర్‌మెలన్‌ చల్లాదనాన్నిస్తుంది. వేసవిలో ఈ రెండూ కలిస్తే చర్మానికి తగిన రక్షణ లభిస్తుంది. ఒక కప్పు పెరుగులో కొన్ని వాటర్‌మెలన్‌ ముక్కలు వేయాలి. తరువాత బ్రష్‌ సహాయంతో ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత క్లీన్‌ చేసుకోవాలి.


పుదీనా, ముల్తానీ మిట్టితో...

ముల్తానీ మిట్టి చర్మంలో ఉన్న అదనపు ఆయిల్‌ను తీసివేస్తుంది. పుదీనా చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. కొన్ని పుదీనా ఆకులను పేస్టులా చేసి, అరకప్పు ముల్తానీ మిట్టితో కలిపి ముఖం, మెడ భాగాల్లో రాసుకోవాలి. బాగా ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.


గంధంలో రోజ్‌ వాటర్‌ కలిపి...

గంధం చర్మానికి చలువనివ్వడమే కాకుండా మెరుపునిస్తుంది. రోజ్‌వాటర్‌లో రీఫ్రెష్‌ చేసే గుణాలుంటాయి. రెండు టేబుల్‌స్పూన్ల గంధంలో కొద్దిగా రోజ్‌ వాటర్‌ వేసి పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంలో తాజాదనం సంతరించుకుంటుంది.

Updated Date - 2022-04-06T17:02:38+05:30 IST