ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2022-06-25T05:42:05+05:30 IST

ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ప్రజలను రోగాల బారి నుంచి కాపాడాల్సిన ఆవశ్యకత సర్పంచులపై ఉందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి


కర్నూలు(న్యూసిటీ/అగ్రికల్చర్‌) జూన్‌ 24: ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ప్రజలను రోగాల బారి నుంచి కాపాడాల్సిన ఆవశ్యకత సర్పంచులపై ఉందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. ఏపీఎ్‌సఐఆర్‌డీ విజవాయవాడ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన సర్పంచులకు రైతు సాధికారిత సంస్థ, ఏపీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌ సంస్థ సంయుక్తంగా శుక్రవారం జిల్లా పరిషత్‌ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో శిక్షణ ఇచ్చారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌తో పాటు జడ్పీ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య, డిప్యూటీ సీఈవో టీవీభాస్కర్‌నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ బెల్లం మహేశ్వరరెడ్డి, ఫిషరీస్‌ ఏడీ శ్యామల హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ సేంద్రియ ఎరువులతో పండించిన పంటలతోనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. డీఆర్‌డీఏ సహకారంతో మండలంలోని ఒక గ్రామంలో ఐదు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రణాళికలను సిద్ధ్దం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణలో కర్నూలు డివిజన్‌ పరిధిలోని 40 గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T05:42:05+05:30 IST