నల్లమలలో నాటుతుపాకీ లభ్యం

ABN , First Publish Date - 2021-10-27T05:33:03+05:30 IST

రుద్రవరం రేంజిలోని తుండ్లవాగు రిజర్వాయర్‌ సమీపంలో అటవీ ప్రాంతంలో నాటుతుపాకీ లభించినట్లు సెక్షన్‌ ఆఫీసర్‌ రాణెమ్మ మంగళవారం తెలిపారు.

నల్లమలలో నాటుతుపాకీ లభ్యం
ఎస్‌ఐకి నాటుతుపాకీ స్వాధీనం చేస్తున్న ఫారెస్టు అధికారులు

రుద్రవరం, అక్టోబరు 26: రుద్రవరం రేంజిలోని తుండ్లవాగు రిజర్వాయర్‌ సమీపంలో అటవీ ప్రాంతంలో నాటుతుపాకీ లభించినట్లు సెక్షన్‌ ఆఫీసర్‌ రాణెమ్మ మంగళవారం తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా అటవీలో వెళ్తుండగా నాటుతుపాకీ కనిపించిందని అన్నారు. నాటుతుపాకీని రేంజర్‌ శ్రీపతినాయుడు ఆదేశాల మేరకు రుద్రవరం పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ రాజకులాయప్పకు స్వాధీనం చేసినట్లు రాణెమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీట్‌ ఆఫీసర్లు రామేశ్వరి, రమాదేవి, రామకృష్ణ పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-27T05:33:03+05:30 IST