'జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన మా విజయ్. ఆ జర్నీ నుంచి మా సినిమా ఫంక్షన్‌కు గెస్ట్‌గా రావడం నా లైఫ్‌లో చాలా మెమరబుల్ మూమెంట్' అని అన్నాడు నవీన్ పొలిశెట్టి. ఈయన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో కలిసి నటిస్తోన్న చిత్రం ‘జాతి రత్నాలు’. మార్చి 11న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ ‘‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో మొదలైన ప్రయాణం.. ఈ జాతిరత్నాలు వరకు వచ్చింది.. ప్రభాస్ అన్నతో మా సినిమా.. డార్లింగ్ రత్నాలు అయ్యింది.. ఇప్పుడు విజయ్ రావడంతో డార్లింగ్ రౌడీ కాస్త రత్నాల ఫ్యామిలీలా మారిపోయింది. ఎక్కడో యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం.. ఇది మీ సినిమా యూత్ సినిమా. పోస్టర్లో జాతి రత్నాలు అంటే మేం కనిపిస్తున్నాం.. కానీ నాగ్ అశ్విన్, స్వప్నా, ప్రియాంక అసలు రత్నాలు.
జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన మా విజయ్. ఆ జర్నీ నుంచి మా సినిమా ఫంక్షన్‌కు గెస్ట్‌గా రావడం నా లైఫ్‌లో చాలా మెమరబుల్ మూమెంట్.. ఈ సినిమా నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలి.. లాక్డౌన్లో ఓటీటీ నుంచి ఎన్ని డీల్స్ వచ్చినా కూడా భద్రంగా కాపాడారు.. థియేటర్లో ప్రేక్షకులు నవ్వుకుంటూ ఉంటే చూడాలని ఎంతో భద్రంగా కాపాడారు. ఎన్ని కష్టాలున్నా ఓ ఐదు నిమిషాలు నవ్వుకుంటే.. లైఫ్ నేను అనుకున్నంత బ్యాడ్‌గా లేదేమో అనే ధైర్యాన్ని నవ్వు ఇస్తుంది.. ఆ నవ్వును మీకు పంచేందుకు మార్చి 11న మేం వస్తున్నాం.. జాతి రత్నాలు సినిమాతో ఎంజాయ్ చేద్దాం’’ అన్నారు.