లొంగిపోయేందుకు సమయం కావాలి: కోర్టుకు Navjot Sidhu అభ్యర్థన

ABN , First Publish Date - 2022-05-20T17:15:05+05:30 IST

ఘర్షణ కేసులో లొంగిపోయేందుకు తనకు మరింత సమయం ఇవ్వాలని పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కోర్టును అభ్యర్థించారు....

లొంగిపోయేందుకు సమయం కావాలి: కోర్టుకు Navjot Sidhu అభ్యర్థన

సుప్రీంకోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ: ఘర్షణ కేసులో లొంగిపోయేందుకు తనకు మరింత సమయం ఇవ్వాలని పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కోర్టును అభ్యర్థించారు.1988లో జరిగిన కేసులో సుప్రీంకోర్టు తనకు ఏడాది జైలు శిక్ష విధించిన తర్వాత, వైద్య కారణాలపై లొంగిపోవడానికి కొంత సమయం కావాలని నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం... ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ముందు ప్రస్తావించాలని కోరింది.ఈ కేసులో లొంగిపోవడానికి వైద్యకారణాలతో మరింత సమయం కావాలని కోరుతూ వేసి పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈరోజు పటియాలా కోర్టులో లొంగిపోవాల్సి ఉంది.నవజ్యోత్ సిద్ధూ తరఫు సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించాలని అభ్యర్థించగా కోర్టు అనుమతి నిరాకరించింది.34 ఏళ్ల నాటి కేసులో పాటియాలా నివాసి గుర్నామ్ సింగ్ మరణించిన పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూను నిర్దోషిగా పేర్కొంటూ మే 2018లో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు గతంలో అనుమతించింది.






1988 డిసెంబరు 27న పటియాలాలో కారు పార్కింగ్‌ విషయమై గుర్నామ్‌సింగ్‌(65)కు.. సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపీందర్‌సింగ్‌కు మధ్య ఘర్షణ జరిగింది. సిద్ధూ, సంధూలు గుర్నామ్‌ సింగ్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గుర్నామ్‌ను ఆస్పత్రికి తర లించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గతంలో సిద్ధూ రూ. 1,000 జరిమానాతో విడిచిపెట్టారు. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 323 కింద సుప్రీంకోర్టు సిద్ధూకి గరిష్ట శిక్ష విధించింది.అయితే సీనియర్ సిటిజన్‌ను బాధపెట్టినందుకు అతన్ని దోషిగా నిర్ధారించింది.ఈ కేసును ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు స్వీకరించింది. అయితే రివ్యూ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం నాడు సుప్రీంకోర్టు సిద్ధూకి ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది.


Updated Date - 2022-05-20T17:15:05+05:30 IST