అది కారాగారమా.. ఆరోగ్య కేంద్రమా?

ABN , First Publish Date - 2022-05-27T06:59:34+05:30 IST

జైలుకెళితే చిప్పకూడు తప్పదు అనే మాటను తరచూ వింటుంటాం. కానీ, అది ఖైదీలందరికీ వర్తించదు.

అది కారాగారమా.. ఆరోగ్య కేంద్రమా?

సిద్ధూకు జైల్లో ప్రత్యేక ఆహారం 


పటియాల(పంజాబ్‌), మే 26: జైలుకెళితే చిప్పకూడు తప్పదు అనే మాటను తరచూ వింటుంటాం. కానీ, అది ఖైదీలందరికీ వర్తించదు. వీవీఐపీ ఖైదీలకు జైల్లో జరిగే మర్యాదలకు వేరే లెక్క ఉంటుంది. పటియాల కారాగారంలో ఉన్నకాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు జైలు అధికారులు ఇచ్చే ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లుతోపాటు తృణధాన్యాలే ఎక్కువగా ఉంటాయి. లాక్టోజ్‌ లేని పాలతో చేసిన టీ, లస్సీ, సలాడ్‌లతోపాటు పండ్లు, పండ్ల రసాలు అందిస్తారు. ఇక, మధ్యాహ్న భోజనంలో ఇచ్చే చపాతీ, కూరల తయారీకి ఆలివ్‌, రైస్‌బ్రాన్‌ లేదా ఆవ నూనె మాత్రమే వాడతారు. ఇలా సిద్ధూకి మూడు పూటల అందించే ఆహారం కోసం ప్రత్యేకంగా ఓ మెనూనే ఉంది. ఆ మెనునూ చూస్తే సిద్ధూ జైలుకెళ్లాడా? ఆరోగ్యం మెరుగుపర్చుకునేందుకు ఏదైనా ఆరోగ్య కేంద్రంలో చేరాడా? అనే సందేహం రాక తప్పదు. నిజానికి, సిద్ధూ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మెనూ అమలుకు అనుమతినిచ్చిందని మాజీ క్రికెటర్‌ సన్నిహితులు చెబుతున్నారు.

Updated Date - 2022-05-27T06:59:34+05:30 IST