దమ్ముంటే నాపై పోటీ చెయ్: Uddhavకు Navneet Rana సవాల్

ABN , First Publish Date - 2022-05-08T20:07:43+05:30 IST

ముంబై: దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని Amravati ఎంపీ నవ్‌నీత్ రాణా శివసేన అధినేత, Maharashtra Chief Minister Uddhav Thackerayకు సవాల్ విసిరారు.

దమ్ముంటే నాపై పోటీ చెయ్: Uddhavకు Navneet Rana సవాల్

ముంబై: దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని Amravati ఎంపీ Navneet Rana శివసేన అధినేత, Maharashtra Chief Minister Uddhav Thackerayకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసినా పర్వాలేదన్నారు. మహిళా శక్తి అంటే ఏంటో థాకరేకు చూపిస్తామని నవ్‌నీత్ రాణా అన్నారు. తాను ఏ తప్పు చేశానని జైళ్లో పెట్టారని ఆమె ప్రశ్నించారు. హనుమాన్ చాలీసా చదవడం తప్పా అని ఆమె నిలదీశారు. Hanuman Chalisa చదవడం నేరమైతే 14 రోజులు కాదు 14 సంవత్సరాలైనా జైలుకెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 


రెండు వారాల క్రితం థాకరే నివాసం మాతో శ్రీ ముందు హనుమాన్ చాలీసా చదివేందుకు యత్నించారనే ఆరోపణలతో నవ్‌నీత్ రాణాను, ఆమె భర్త Ravi Ranaను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 12 రోజుల వరకూ వారికి బెయిల్ రాలేదు.

Read more