మరింత హీటెక్కిన మహా పంచాయితీ.. మాలిక్ vs ఫడ్నవీస్

ABN , First Publish Date - 2021-11-09T23:34:58+05:30 IST

కుర్లాలోని గోవాల కాంపౌండ్‌లో ఎన్సీపీ నవాబ్ మాలిక్‌ చాలా తక్కువ ధరకు ఆస్తి కొనుగోలు చేశారు. 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితుల వ్యక్తుల నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో ఈ ఆస్తులు కొనుగోలు చేశారు. అంతే కాకుండా ముంబై నేరస్థులైన సర్దార్ శహ్వాని ఖాన్, సలీమ్ పటేల్‌లతో మాలిక్‌కు ఒప్పందం ఉంది..

మరింత హీటెక్కిన మహా పంచాయితీ.. మాలిక్ vs ఫడ్నవీస్

ముంబై: షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కుమారుడి అరెస్ట్ అనంతరం నాటి నుంచి మహా రాజకీయాలు రోజుకో కొత్త మలుపులతో రోజుకో కొత్త కాంట్రవర్సీతో హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ఆర్యన్ బయటికి రావడం ఎన్‌సీబీ అధికారి వాంఖడే జైలుకు వెళ్లడం.. ఈ విషయమై ఎన్సీపీ, శివసేన, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం పొలిటికల్ కాంట్రవర్సీకి తెరలేపాయి. డ్రగ్స్ కేసు క్రమక్రమంగా రాజకీయాల్ని పులుముకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న పార్టీల మధ్య యుద్ధానికి దారి తీసింది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నవాబ్ మాలిక్, భారతీయ జనతా పార్టీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 1993 బాంబ్ బ్లాస్ట్ కేసులో నవాబ్ మాలిక్‌కు ప్రమేయం ఉందంటూ ఫడ్నవీస్ ఆరోపిస్తుండగా.. తాను ఒక్క హైడ్రోజన్ బాంబ్ వేస్తే దేవేంద్ర ఫడ్నవీస్ కుంభకోణాలన్నీ భయటపడతాయని మాలిక్ హెచ్చరిస్తున్నారు.


‘‘కుర్లాలోని గోవాల కాంపౌండ్‌లో ఎన్సీపీ నవాబ్ మాలిక్‌ చాలా తక్కువ ధరకు ఆస్తి కొనుగోలు చేశారు. 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితుల వ్యక్తుల నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో ఈ ఆస్తులు కొనుగోలు చేశారు. అంతే కాకుండా ముంబై నేరస్థులైన సర్దార్ శహ్వాని ఖాన్, సలీమ్ పటేల్‌లతో మాలిక్‌కు ఒప్పందం ఉంది’’ అని దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. కాగా ఫడ్నవీస్ ఆరోపణలపై మాలిక్ స్పందిస్తూ ‘‘సలీం పటేల్‌ నుంచి చట్టబద్ధంగా ఆస్తులు కొనుగోలు చేశాం. దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయి. స్టాంప్ డ్యూటీకి చెల్లించిన రశీదులు కూడా ఉన్నాయి. కానీ ఫడ్నవీస్ తప్పుడు ఆరోపణలు చేస్తూ బురద చల్లాలని చూస్తున్నారు. 62 ఏళ్ల నా జీవితం, 26 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎవరూ నాకు అండర్‌వల్డ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు చేయలేదు. తప్పులు చేసేది వాళ్లు. ఒక్క హైడ్రోజన్ బాంబ్ వేస్తే ఫడ్నవీస్ కుంభకోణాలన్నీ బయటపడతాయి’’ అని మాలిక్ అన్నారు.

Updated Date - 2021-11-09T23:34:58+05:30 IST