న్యాయం జరగాలని అంబేద్కర్‌కు వినతిపత్రం

ABN , First Publish Date - 2022-01-27T02:58:56+05:30 IST

పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను రద్దుచేసి, తమకు న్యాయం జరిగేలా ప్ర భుత్వం చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ బీఆర్‌ అం

న్యాయం జరగాలని అంబేద్కర్‌కు వినతిపత్రం
అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న పీఆర్సీ సాధన సమితి నాయకులు

నాయుడుపేట టౌన్‌, జనవరి 26 : పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను రద్దుచేసి,  తమకు న్యాయం జరిగేలా ప్ర భుత్వం చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి బుధవారం పీఆర్‌సీ సాధన సమితి నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ న్యాయం జరిగేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో పీఆర్‌సీ సాధన సమితి నాయకులు బాలసుబ్రహ్మణ్యం, ప్రసాద్‌, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. 


సూళ్లూరుపేటలో..


సూళ్లూరుపేట, జనవరి 26 : అసంబద్దమైన పీఆర్‌సీ జీవోను రద్దుచేసేలా, నేతలకు మంచి మనసు ఇవ్వాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి బుధవారం సూళ్లూరుపేటలో పీఆర్‌సీ సాధన సమితి  వినతిపత్రం సమర్పించింది. అనంతరం అక్కడే మానవహారంగా నిలిచి పీఆర్‌సీ రద్దుచేయాలని నినాదాలు చేశారు. సూళ్లూరుపేట, తడ,  దొరవారిసత్రం మండలాలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఫెన్షనర్లు, ఔట్‌సోర్సింగ్‌, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంజీవో నేత సాల్మాన్‌రాజ్‌, గిరి, యూటీఎఫ్‌ నేత ప్రభాకర్‌, ఏపీహెచ్‌ఎంఎ నేత వెంకటేశ్వర్లు, బీటీఏ నేత మునస్వామి, ఏపీటీఎఫ్‌ గోపీనాథ్‌రావు, యూటీఎఫ్‌ మహిళా కమిటీ నేతలు సునీల, అరుణకుమారి, ఉషారాణి,  రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సీఐటీయునేత సీహెచ్‌ సుధాకర్‌, ఆర్టీసీ నేత రమణయ్య పాల్గొని మద్దతు తెలిపారు. 




Updated Date - 2022-01-27T02:58:56+05:30 IST