ఈ వార్తలపై ఈ మలయాళ బ్యూటీ డైరెక్టుగా స్పందించడం లేదు. కానీ, ఆమె సన్నిహిత వర్గాల సమాచారం మేరకు నయనతార వచ్చే యేడాదిలో పెళ్ళి చేసుకుని ఇంటికే పరిమితంకావాలన్న ఆలోచనలో వుందట. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలను ఈ యేడాది ఆఖరునాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో వుంది. అదేసమయంలో తన కాబోయే భర్తతో కలిసి కొన్ని సినిమాలు నిర్మిస్తూ, సినిమా డిస్ట్రిబ్యూటర్గాను కొనసాగాలన్న బలమైన పట్టుదలతో నయనతార ఉన్నట్టు సమాచారం.