ఓటీటీలోనే నయనతార కొత్త చిత్రం

Jul 22 2021 @ 20:51PM

కోలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటించిన ‘నెట్రికణ్‌’ చిత్రం ఓటీటీలో విడుదలకానుంది. ఈ మేరకు ఆ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దక్షిణాది భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి రౌడీ పిక్చర్స్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానరులో నిర్మించిన తొలి చిత్రం ‘నెట్రికణ్’‌. 2011లో విడుదలైన ‘బ్లైండ్‌’ అనే కొరియన్‌ మూవీకి ఇది రీమేక్‌. వాస్తవానికి గత యేడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కానీ, వివిధ కారణాలతో పాటు లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా ఈ చిత్ర విడుదలను వాయిదావేశారు.


గత యేడాది నవంబరులో ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో నెట్రికణ్‌ మూవీని డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గత యేడాది దీపావళికి నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘మూక్కుత్తి అమ్మన్‌’ చిత్రం విడుదలై మంచి సక్సెస్‌ అందుకుంది. ఆ చిత్రం తర్వాత నయనతార అంధురాలి పాత్రలో నటించిన మరో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ అయిన ఈ నెట్రికణ్‌ ఓటీటీలోనే రిలీజ్‌కానుండటం గమనార్హం. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.