తుది దశకు ఎన్‌సీడీ సర్వే

Published: Mon, 23 May 2022 00:38:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తుది దశకు ఎన్‌సీడీ సర్వే

- కొనసాగుతున్న అసంక్రమిత వ్యాధుల గుర్తింపు 

- 30 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య పరీక్షలు, మందులు

- షుగర్‌, బీపీ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కిట్లు పంపిణీకి ఏర్పాట్లు

జగిత్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అసంక్రమిత వ్యాధులున్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే తుది దశకు చేరుకుంటోంది. ఈ సర్వేలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్‌ ఉన్న రోగులను గుర్తిస్తూ నాన్‌ కమ్యూనికేషనల్‌ డిసీజ్‌ (ఎన్‌సీడీ) నిర్వహి స్తున్నారు. రాష్ట్రంలో 2018 సంవత్సరంలో పైలెటు ప్రాజెక్టు కింద జనగా మ జిల్లాలో అసంక్రమిత వ్యాధుల గుర్తింపు కార్యక్రమాన్ని ప్రభుత్వం ని ర్వహించింది. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా ల్లోనూ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో వైద్య ఆ రోగ్య శాఖ అధికారులు ఇంటింటి సర్వేను కొన్ని రోజులుగా నిర్వహిస్తు న్నా రు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల పరిదిలోని అన్ని గ్రామ, పట్టణ ప్రాంతా ల్లో ప్రతీ ఇంటికి వైద్య బృందం వెళ్లి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తు న్నారు. ఇందులో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ వ్యాదుల గుర్తింపున కు స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. ఈనెలాఖరులోపు సర్వేను పూర్తి చేసే దిశగా అధికారులు పనిచేస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ...

జిల్లా వ్యాప్తంగా 10,54,000 జనాభా ఉంది. 2011 జనాభా లెక్కల ప్ర కారం జిల్లాలో 9,85,417 మంది జనాభా ఉంది. ఇందులో పురుషులు 4,84,079, స్త్రీలు 5,01,338 మంది ఉన్నారు. జిల్లాలో అక్షరాస్యులు 5,37, 636 మంది ఉన్నారు. జిల్లాలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న వ్యక్తులు 5,08, 616 మంది ఉన్నారు. జిల్లా జనాభాలో 52. 69 శాతం మంది మూడు పదుల వయస్సును దాటిన వారు ఉన్నారు. జిల్లాలో 19 పీహెచ్‌సీలు, 151 సబ్‌ సెంటర్లు, 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 9 ఉన్నా యి. జిల్లాలో విలేజ్‌ హెల్త్‌ రిజిస్ట్రేషన్‌(వీహెచ్‌ఆర్‌)లో 8,92,732 మంది ఇప్పటివరకు నమోదయ్యారు. జిల్లాలో ఆశ డిసీజేస్‌ ఫ్రొఫైల్‌ (ఏడీపీ)లో 8,41,980 మంది పూర్తి చేసుకున్నారు. ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి 2,98,808 మందికి పరీక్షలు పూర్తి చేశారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన సర్వేలో 92.49 శాతం వీహెచ్‌ఆర్‌ నమోదు, 87.23 శాతం ఏడీపీ పూర్తి, 58.54 శాతం ఏఎన్‌ఎం స్ర్కీనింగ్‌ పూర్తి చేశారు.

అసంక్రమిత వ్యాధి గ్రస్థుల వివరాలు...

జిల్లా వ్యాప్తంగా ఎన్‌సీడీ సర్వేలో అసంక్రమిత వ్యాధి గ్రస్థులను గు ర్తిస్తున్నారు. ఇప్పటివరకు సర్వేలో హైపర్‌ టెన్షన్‌ (హెచ్‌టీఎన్‌)గా 49,038 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో ఆసుపత్రుల్లో 27,152 మందిని గుర్తించగా ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి 21,886 మందిని ప్రైవేటుగా గుర్తించారు. అదేవిధంగా జిల్లాలో డయాబెటిక్‌ వ్యాధి గ్రస్థులు 18,749 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో ఆసుపత్రుల్లో 11,088 మందిని, ప్రైవేటుగా ఇంటింటికి వెళ్లి 7,661 మందిని డయోబెటిక్‌ వ్యాధి గ్రస్థులుగా గుర్తించారు. జిల్లాలో 359 మంది క్యాన్సర్‌ వ్యాధి గ్రస్థులున్నట్లుగా ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలో తేలింది. ఇందులో రొమ్ము క్యాన్సర్‌ 123 మంది, నోటి క్యాన్సర్‌ 91 మంది, సర్వేకల్‌ క్యాన్సర్‌ 80 మంది, ఇతర క్యాన్సర్‌ వ్యాది గ్రస్థులు 65 మంది ఉన్నట్లుగా గుర్తించారు.

ఆరోగ్య కేంద్రాల వారిగా....

జిల్లాలో పీహెచ్‌సీల వారిగా ఎన్‌సీడీ సర్వే జరుగుతోంది. 2022 జనవరి నుంచి అసంక్రమత వ్యాధులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేస్తున్నా రు. ఎన్‌సీడీ సర్వేలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్‌ ఉన్న రోగులను గుర్తిస్తూ నాన్‌ కమ్యునికేషన్‌ డిసీజ్‌ కిట్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా వృద్దులు, నిరక్షరాస్యులు మందులు ఎలా వాడాలో అంశాలపై సులభంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. సర్వేలో 30 ఏళ్లు దాటిన పురుషులు, మహిళలకు ప్రాథమిక పరీక్షలు ని ర్వహించి షుగర్‌, బీపీతో పాటు నోటి, రొమ్ము, గర్బాశయ ముఖద్వార క్యా న్సర్‌ను గుర్తిస్తున్నారు. వీరిలో బీపీ, షుగర్‌ ఉన్నట్లుగా నిర్ధారణ అయితే మరోమారు వైద్యాధికారి ద్వారా ప్రత్యేక పరీక్షలు చేయించి వారికి ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు ద్వారా మందులను ఉచి తంగా అందిస్తున్నారు. మొదటి నెలలో ఇచ్చిన మందులు పనిచేస్తు న్నాయా లేదా అని పరీక్షిస్తున్నారు. 

ఇక ఇంటి వద్దకే మందుల కిట్లు...

మధుమేహం, రక్తపోటు, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి మందులతో కూడిన కిట్టును అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిం చనుంది. ఇటీవల మంత్రి హరీశ్‌రావు మహబూబాబాద్‌లో కిట్టుల పం పిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా లో సమర్థవంతంగా అమలు చేయడానికి యోచిస్తున్నారు. జగిత్యాల జి ల్లాలో అసంక్రమతి వ్యాధుల జాబితాలో నమోదైన వ్యాధిగ్రస్థుల ఇంటికి వెళ్లి అందజేయడానికి వైద్యాధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఒక పర్సు రూపంలో ఉండే కిట్టులో మూడు వేర్వేరు రంగుల పౌచ్‌లు ఉంటాయి. రోజు సమయాన్ని బట్టి మందులను వేరు చేసి అందులో ఉంచుతారు. దీని వల్ల చదువు రాని వారికి సైతం ఉదయం, మధ్యాహ్నాం, రాత్రి వేళల్లో ఏ మందులు వేసుకోవాలో ప్రజలకు అర్థమయ్యేలా కిట్టును రూపొందిం చారు. ప్రతీ ఒక్కరికి నెల రోజులకు సరిపడా మందులను కిట్టు ద్వారా అందించనున్నారు.

పకడ్భందీగా సర్వే చేస్తున్నాము

- డాక్టర్‌ సమీయోద్దిన్‌, ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా ఎన్‌సీడీ సర్వేను నిర్వహిస్తున్నాము. పకడ్భందీగా ఇంటింటి సర్వేను చేస్తున్నాము. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 30 సంవత్సరాలు పైబడిన వ్యక్తు లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో అసంక్రమిత వ్యాధుల బారిన పడిన వివరాలను నమోదు చేస్తున్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.