మహారాష్ట్ర మంత్రిపై రూ.1000కోట్లకు defamation suit

ABN , First Publish Date - 2021-11-30T17:00:20+05:30 IST

మహారాష్ట్ర కేబినెట్ మంత్రి,ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ పై ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ రూ.1000 కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది...

మహారాష్ట్ర మంత్రిపై రూ.1000కోట్లకు defamation suit

6వారాల్లో సమాధానం చెప్పాలని బొంబాయి హైకోర్టు ఆదేశం

ముంబై: మహారాష్ట్ర కేబినెట్ మంత్రి,ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ పై ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ రూ.1000 కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది.ఈ పరువు నష్టం దావాపై రిప్లై దాఖలు చేసేందుకు మంత్రి నవాబ్ మాలిక్, మరో ఏడుగురికి బాంబే హైకోర్టు ఆరు వారాల సమయం ఇచ్చింది. జులై 1, 4వతేదీల మధ్య బ్యాంకుకు వ్యతిరేకంగా నిరాధారమైన, దిగ్భ్రాంతికరమైన  పరువు నష్టం కలిగించే ప్రకటనలతో కూడిన హోర్డింగ్‌లు ముంబైలోని రద్దీ కూడళ్లలో ఉంచారు.ఈ హోర్డింగులను లక్షలాది మంది ముంబై ప్రజలు వీక్షించారని, దీనివల్ల తమ ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతీశారని బ్యాంక్ పేర్కొంది.


బ్యాంకు తరపున న్యాయవాది అఖిలేష్ చౌబే పిటిషన్ దాఖలు చేశారు. ఈ హోర్డింగులపై తాము నవాబ్ తోపాటు ఇతరులకు నోటీసులు పంపినా స్పందించలేదని, మాలిక్ బహిరంగ క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని చెప్పారని బ్యాంకు తరపున న్యాయవాది చెప్పారు. ఈ హోర్డింగులతో తనకు గాని, తన పార్టీకి గాని సంబంధం లేదని నవాబ్ మాలిక్ ప్రత్యుత్తరం ఇచ్చారు.బ్యాంకులో అక్రమాలు జరిగాయని, డిపాజిట్లు సురక్షితం కాదని ప్రచారం ప్రచారం చేసి తమ బ్యాంకు పరువుకు నష్టం కలిగించారని పిటిషన్ లో పేర్కొన్నారు. తమ బ్యాంకు పరువుకు నష్టం కలిగించిన మంత్రి నవాబ్ మాలిక్, ఇతరులు రూ.1000కోట్లను నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించాలని కోర్టును బ్యాంకు కోరింది. మొత్తంమీద మంత్రిపై సహకార బ్యాంకు పరువునష్టం దావా వేయడం ముంబైలో సంచలనం రేపింది.


Updated Date - 2021-11-30T17:00:20+05:30 IST