Droupadi Murmuకు ఉద్ధవ్ సేన మద్దతు!

ABN , First Publish Date - 2022-07-12T00:11:28+05:30 IST

ముంబై: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. ముంబైలోని ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీలో జరిగిన శివసేన ఎంపీల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Droupadi Murmuకు ఉద్ధవ్ సేన మద్దతు!

ముంబై: NDA రాష్ట్రపతి అభ్యర్ధి Droupadi Murmuకు Shiv Sena మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. ముంబైలోని ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీలో జరిగిన Shiv Sena ఎంపీల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుమారు 12 మందికి పైగా ఎంపీలు ముర్ముకు మద్దతివ్వాలని సూచించినట్లు తెలిసింది. ఉద్ధవ్ నివాసంలో జరిగిన సమావేశానికి ఇద్దరు ఎంపీలు తప్ప అందరూ హాజరయ్యారు. Shiv Senaకు మొత్తం 18 మంది ఎంపీలున్నారు. వీరిలో ఇవాళ్టి సమావేశానికి డుమ్మా కొట్టిన వారిలో భావన, శ్రీకాంత్ షిండే (సీఎం ఏక్‌నాథ్ షిండే తనయుడు) ఉన్నారు. మెజార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తుండటంతో ఉద్ధవ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో గతంలో కూడా Shiv Sena రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ ఎంపీ గజానన్ కీర్తికర్ గుర్తు చేశారు. ప్రతిభా పాటిల్ యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధి అయినా మరాఠీ మహిళ కావడంతో గతంలో మద్దతిచ్చామన్నారు. అలాగే యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధి అయినా ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చామని కీర్తికర్ చెప్పారు. Droupadi Murmu గిరిజన మహిళ కావడం వల్ల ఉద్ధవ్ ఆమెకే మద్దతిస్తారని ఆయన చెప్పారు. 





మహారాష్ట్రలో ఇటీవల శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణానికి వ్యతిరేకంగా, ఉద్ధవ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఎమ్మెల్యేలు షిండే నాయకత్వాన్ని బలపరిచినా ఎంపీలు మాత్రం ఉద్ధవ్‌తోటే ఉన్నారు. దీంతో Droupadi Murmuకు ఉద్ధవ్ మద్దతు కీలకంగా మారింది. 


మరోవైపు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి Droupadi Murmu దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాజకీయ పార్టీల మద్దతు సంపాదిస్తున్నారు. ఎన్డీయేతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఆమె యత్నిస్తున్నారు. 

Updated Date - 2022-07-12T00:11:28+05:30 IST