‘‘TOBACCO FREE ZONE’’గా ఇంద్ర కీలాద్రి

ABN , First Publish Date - 2022-06-25T22:29:06+05:30 IST

ఎన్టీఆర్ జిల్లా: ఏపీ పుణ్యక్షేత్రాల్లో విజయవాడ ప్రముఖమైంది. రోజూ వందల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. పండుగలు, పర్వదినాల్లో భక్తుల తాకిడి మరీ

‘‘TOBACCO FREE ZONE’’గా ఇంద్ర కీలాద్రి

ఎన్టీఆర్ జిల్లా: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడ ఒకటి. రోజూ వందల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. పండుగలు, పర్వదినాల్లో భక్తుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుమల తరహాలోనే ఇంద్రకీలాద్రిని కూడా ‘‘టొబాకో ఫ్రీ  జోన్‌’’గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన డిక్లరేషన్‌పై కలెక్టర్ ఢిల్లీ రావు, ఆలయ ఈవో, డీఎంహెచ్‌వో సంతకాలు చేశారు. భక్తులు, ఆలయ సిబ్బంది కచ్చితంగా ఈ నిబంధన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. 


నిబంధన ఉల్లంఘిస్తే ఫైన్ రూ. 200

‘‘టొబాకో నియంత్రణలో భాగంగా సిగరెట్, ఇతర టొబాకో ఉత్పత్తులను దుర్గగుడిలో పూర్తిగా నిషేధిస్తున్నాం. తిరుమలలో అమలవుతోన్న cotpa యాక్ట్‌ను దుర్గమ్మ గుడిలోనూ అమలు చేయాలని నిర్ణయించాం. నేటి నుంచి దుర్గగుడి పరిసర ప్రాంతాలు టొబాకో ఫ్రీ జోన్‌గా ప్రకటించాం. ఉద్యోగులు, భక్తులు ఎవరైనా టొబాకో కాని మరే ఇతర ప్రాడక్ట్స్ వాడకూడదు. ఈ నిబంధన తప్పకుండా పాటించాలి. దుర్గగుడి అధికారులు, ఆరోగ్యశాఖ అధికారుల నిరంతరం నిఘా ఉంటుంది. నిబంధన ఉల్లంఘించిన వారికి రూ. 200 ఫైన్ వేస్తాం.’’ అని కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు.

Updated Date - 2022-06-25T22:29:06+05:30 IST