విపత్తుల నిర్వహణ కార్యాలయాన్ని సందర్శించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఐజీ

ABN , First Publish Date - 2022-07-02T05:26:57+05:30 IST

తాడేపల్లి మండంలోని కుంచనపల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఐజి నరేంద్ర సింగ్‌ బండోలా నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన బృందం సందర్శించింది.

విపత్తుల నిర్వహణ కార్యాలయాన్ని సందర్శించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఐజీ
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఐజీ నరేంద్ర సింగ్‌ బండోలా

తాడేపల్లి, జూలై1: తాడేపల్లి మండంలోని కుంచనపల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఐజి నరేంద్ర సింగ్‌ బండోలా నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన బృందం సందర్శించింది. విపత్తుల నిర్వహణ సంస్థ అవలంబిస్తున్న అనేక అత్యాధునిక పరిజ్ఞానాలను ఐజి నరేంద్రసింగ్‌ తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించడానికి ఇంటెగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్న స్టేట్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌లోని 24/7 పర్యవేక్షించే విధానాన్ని తెలుసుకోవడానికి వచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పిడుగులు, వడగాలులు, తుపానులు సంభవించినప్పుడు అమలు పరిచే ప్రణాళికలు ముందస్తు హెచ్చరికలు జారీ చేసే కమ్యూనికేషన్‌ వ్యవస్థ గురించి విపత్తుల సంస్థ ఈడీ నాగరాజు వివరించారు. అదే విధంగా కమ్యూనికేషన్‌ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్‌ ఫోన్స్‌, శాటిలైటడ్‌ బేస్‌డ్‌ మొబైల్‌ డేటా వాయిస్‌ టెర్మినల్‌ సాంకేతికతను ప్రత్యక్షంగా చూపించారు. వెబ్‌ ఈవోసీ, జియోగ్రఫిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం గురించి కూడా వివరించారు. ఈ బృందంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీఐజీ మొహసేన్‌ షహేదీ, 10వ బెటాలియన్‌ కమాండెంట్‌ జాహిద్‌ ఖాన్‌, డిప్యూటి కమాండెంట్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక విపత్తుల శాఖ అధికారులు సీహెచ్‌ శాంతిస్వరూప్‌, ఎంఎం ఆలీ, ఫైజల్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-07-02T05:26:57+05:30 IST