Advertisement

అరుణ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపు

Nov 29 2020 @ 00:12AM
మంజీరాలో గాలింపు చర్యలు చేపడుతున్న ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు

మనూరు, నవంబరు 28 : ఈనెల 26న సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శిక్షణా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏవో అరుణ మనూరు మండలం రాయిపల్లి మంజీరా బ్రిడ్జి వద్ద ఆత్మహత్య పాల్పడిన విషయం విధితమే. మంజీరాలో మూడురోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ దొరకలేదు. శనివారం జిల్లా అధికారులు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాన్ని తీసుకొచ్చి మంజీరా నదిలో గాలింపు చర్యలు చేపట్టినా సాయంత్రం వరకూ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని నారాయణఖేడ్‌ ఆర్డీవో అంబాదాస్‌ రాజేశ్వర్‌, సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ నరేందర్‌, రాయికోడ్‌ ఎస్‌ఐ ఏడుకొండలు సందర్శించారు. 

Follow Us on:
Advertisement