గూగుల్‌ నుంచి నియర్‌బై షేర్‌

ABN , First Publish Date - 2020-08-08T05:52:32+05:30 IST

ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం గూగుల్‌ ‘నియర్‌బై షేర్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌తో ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల మధ్య ఫైల్స్‌, ఫొటోలు, వీడియోలను సులభంగా షేర్‌ చేసుకునే వీలు కలుగుతుంది...

గూగుల్‌ నుంచి నియర్‌బై షేర్‌

ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం గూగుల్‌ ‘నియర్‌బై షేర్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌తో ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల మధ్య ఫైల్స్‌, ఫొటోలు, వీడియోలను సులభంగా షేర్‌ చేసుకునే వీలు కలుగుతుంది. ఐఓఎస్‌ వినియోగదారులకు ఉన్న ఎయిర్‌డ్రాప్‌ ఫీచర్‌ మాదిరిగా ‘నియర్‌బై షేర్‌’ పనిచేయనుంది. ఎయిర్‌ డ్రాప్‌ ఫీచర్‌తో ఐఫోన్‌ యూజర్లు ఫొటోలు, వీడియోలను సులభంగా షేర్‌ చేసుకుంటున్నారు. అలాంటి సదుపాయాన్ని ఆండ్రాయిడ్‌ యూజర్లకు సైతం అందుబాటులోకి తేవడానికి గూగుల్‌ ప్రయత్నాలు ప్రారంభించింది.


‘నియర్‌బై షేర్‌’ బటన్‌ను ఆన్‌ చేస్తే మీ చుట్టు పక్కల ఉన్న ఆండ్రాయిడ్‌ యూజర్ల ఫోన్లన్నీ కనిపిస్తాయి. సెక్యూరిటీ కోసం విజిబిలిటీలో మూడు ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఒకటి ‘ఆల్‌’. ఇది ఎంచుకుంటే మీ డివైజ్‌, మీ చుట్టూ ఉన్న ఆండ్రాయిడ్‌ యూజర్లందరికీ కనిపిస్తుంది. రెండోది ‘సమ్‌’. ఇది ఎంపిక చేసుకుంటే మీరు ఎంచుకున్న కాంటాక్ట్స్‌కి మాత్రమే కనిపిస్తుంది. మూడోది ‘హిడెన్‌’. ఈ ఆప్షన్‌ ఎంచుకుంటే ‘నియర్‌బై షేర్‌’ ఆన్‌ చేసినా కూడా ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మీరు కనిపించరు. ఒకవేళ మీకు ఎవరైనా ఫైల్‌ పంపించాలని ప్రయత్నిస్తే దాన్ని యాక్సెప్ట్‌ చేయడం లేదా డిక్లైన్‌ చేయడం మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడానికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం లేదు. రెండు డివైజ్‌లలోనూ ‘నియర్‌బై షేర్‌’ ఫీచర్‌ ఉంటే చాలు.


Updated Date - 2020-08-08T05:52:32+05:30 IST