మాస్కులు ధరించనందుకు రూ.2 వేల జరిమానా

ABN , First Publish Date - 2020-11-30T04:14:58+05:30 IST

మాస్కులు ధరించనందుకు రూ.2 వేల జరిమానా

మాస్కులు ధరించనందుకు రూ.2 వేల జరిమానా

నోయిడా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కొంత మంది కోవిడ్ నిబంధనలను పాటించడం లేదు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించడంలేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పాటించని వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ నోయిడా, నోయిడాలో మాస్కులు ధరించనందుకు దాదాపు రూ. 2 వేల జరిమానా విధించారు.


కోవిడ్-19 మహమ్మారి మధ్య ఫేస్ మాస్క్‌లు లేకుండా దాదాపు 2 వేల మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నోయిడా మరియు గ్రేటర్ నోయిడా అంతటా బహిరంగ ప్రదేశాలకు జరిమానా విధించారు. రూ.1.95 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 20 నుంచి మాస్కులు ధరించనందుకు 7,550 మందికి పైగా చలాన్లు జారీ చేయబడ్డాయని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2020-11-30T04:14:58+05:30 IST