పెరిగిపోతున్న పోలీసుల రాజీనామాలు.. పూర్తిస్థాయి పెన్షన్ కూడా వద్దనుకుని..

ABN , First Publish Date - 2022-08-08T02:24:14+05:30 IST

న్యూయార్క్ పోలీసు డిపార్ట్‌మెంట్తలో సిబ్బంది రాజీనామాల పర్వం కొనసాగుతోంది.

పెరిగిపోతున్న పోలీసుల రాజీనామాలు.. పూర్తిస్థాయి పెన్షన్ కూడా వద్దనుకుని..

ఎన్నారై డెస్క్: న్యూయార్క్ పోలీసు డిపార్ట్‌మెంట్తలో సిబ్బంది రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ ఏడాది ఏకంగా 2465 మంది పోలీసులు తమ రాజీనామా లేఖలు సమర్పించారు. గతేడాది రాజీనామాల కంటే ఇది దాదాపు 42 శాతం అధికం. పూర్తిస్థాయి పెన్షన్ కూడా కాదనుకుని రాజీనామాలకు తెగబడుతున్న వారి సంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోందని అక్కడి మీడియా వ్యాఖ్యానించింది. అక్కడి నిబంధనల ప్రకారం.. 20 ఏళ్ల పాటు పనిచేసిన వారికే రిటైర్మెంట్ తరువాత పూర్తి స్థాయి పెన్షన్ దక్కుతుంది. అంతకుమునుపే రాజీనామా చేస్తున్న వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈ మారు ఏకంగా 71 శాతం పెరిగింది. గత సంవత్సం ఇలా 641 మంది పోలీస్ శాఖను వీడితే ఈ ఏడాది ఏకంగా వారి సంఖ్య ఏకంగా 1098కి పెరిగింది. ‘‘అనేక మంది ఇక చాలు అని అనుకుంటున్నారు. కెరీర్‌లో అత్యున్నత స్థితిలో ఉన్న వారు డిపార్ట్‌మెంట్‌ను వీడడానికి కారణం ఇదే’’ అని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ బెనెవొలెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ లించ్ వ్యాఖ్యానించారు. ఇతర అంశాలపై నెపం నెట్టడాన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్ కట్టిపెట్టాలని తేల్చి చెప్పారు. సమస్య ఉందని ఒప్పుకొను పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించారు. 


న్యూయార్క్ పోలీసు ఉద్యోగంపై ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదని అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో పెరుగుతున్న పోలీసు వ్యతిరేకత, నేరాలు, బెయిల్ చట్టం సంస్కరణలు తదితర అంశాలు ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. రాజీనామాలు చేసిన అనేక మంది ఇతర సివిల్ సర్వీసులను ఎంచుకోవడమో లేదా మరోరాష్ట్రాల్లో పోలీసు ఉద్యోగాల్లో కూదురుకోవడమో చేస్తున్నారని మీడియా చెబుతోంది. డిపార్ట్‌మెంట్‌లో పొడచూపుతున్న అణచివేత ధోరణులు కూడా కారణమని కొందరు పోలీసుల అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2022-08-08T02:24:14+05:30 IST