2020లో భారత్‌ను సందర్శించిన వారిలో అమెరికన్లే టాప్!

ABN , First Publish Date - 2022-04-27T21:25:31+05:30 IST

కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో భారత్‌ను సందర్శించిన విదేశీయుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన వార్షిక రిపోర్ట్ ప్రకారం 2020లో ఏప్రిల్ 1

2020లో భారత్‌ను సందర్శించిన వారిలో అమెరికన్లే టాప్!

ఎన్నారై డెస్క్: కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో భారత్‌ను సందర్శించిన విదేశీయుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన వార్షిక రిపోర్ట్ ప్రకారం 2020లో ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య దాదాపు 32.79లక్షల మంది విదేశీయులు ఇండియాను విజిట్ చేశారు. కొవిడ్ విజృంభిస్తున్న వేళ పెద్ద మొత్తంలో అమెరికన్లు భారత్‌ను సందర్శించినట్లు నివేదిక చెబుతోంది. సుమారు 61 వేల మంది అమెరిన్లు ఇండియాకు వచ్చినట్లు తెలిపింది. అమెరికా తర్వాత బంగ్లాదేశ్(37,774), యూకే(33,323), కెనడా (13,707), పోర్చుగల్ (11,668), ఆఫ్గనిస్తాన్ (11,212) తదితర దేశాలకు చెందిన పౌరులు భారత్‌ను విజిట్ చేసిన జాబితాలో ఉన్నట్టు వెల్లడించింది. 




ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో మార్చి 25, 2020 నుంచి ఏప్రిల్ 21,2020 వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం మే 31 వరకు పొడగించింది. ఆ తర్వాత క్రమంగా ఆంక్షలు సడలించిన ప్రభుత్వం.. విదేశాలతో ‘ఎయిర్ బబుల్’ ఒప్పందం కుదుర్చుకుని పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 



Updated Date - 2022-04-27T21:25:31+05:30 IST