కువైత్‌లో దేశ బహిష్కరణకు గురైన 866 మంది ప్రవాసులు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-14T16:34:05+05:30 IST

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కువైత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాల సంబంధిత కేసులు నమోదైన వందలాది మంది విదేశీ పౌరుల విషయంలో

కువైత్‌లో దేశ బహిష్కరణకు గురైన 866 మంది ప్రవాసులు.. కారణం ఏంటంటే..

కువైత్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కువైత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాల సంబంధిత కేసులు నమోదైన వందలాది మంది విదేశీ పౌరుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి బహిష్కరించింది. డ్రగ్స్‌ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ 2021 ఏడాదిలో దాదాపు 866 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించింది. డ్రగ్స్ సంబంధిత కేసుల కారణంగా దేశ బహిష్కరణకు గురైన వారి జాబితాలో ఇండియన్, ఈజిప్టియన్ కమ్యూనిటీలకు చెందిన పౌరులు మొదటి స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాలను కువైత్ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. 




Updated Date - 2022-01-14T16:34:05+05:30 IST