అవసరమైన మొక్కలను పెంచాలి

ABN , First Publish Date - 2022-05-11T06:47:20+05:30 IST

తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కలను నర్సరీల్లో పెంచాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. మంగళవారం దుర్గానగర్‌లోని అటవీ శాఖ నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు. నర్సరీ విస్తీర్ణం, మొక్కల పెంపకం, ఎరువుల తయారీ, తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. అంతరించిపోతున్న అడవి జాతి మొక్కలను సేకరించి పునరుద్ధించడం అభినందనీయమని,

అవసరమైన మొక్కలను పెంచాలి
నర్సరీలో మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

దుర్గానగర్‌ నర్సరీని సందర్శించిన కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, మే 10: తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కలను నర్సరీల్లో పెంచాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. మంగళవారం దుర్గానగర్‌లోని అటవీ శాఖ నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు. నర్సరీ విస్తీర్ణం, మొక్కల పెంపకం, ఎరువుల తయారీ, తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. అంతరించిపోతున్న అడవి జాతి మొక్కలను సేకరించి పునరుద్ధించడం అభినందనీయమని, మొక్కల పెంపకం, ఎరువుల తయారీల పై ఎంపీడీవోలకు అటవీ శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే నర్సరీలో అవసరమైన మొక్కలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఇందులో జిల్లా అటవి శాఖ అధికారి రాజశేఖర్‌, ఎఫ్‌ఆర్‌వో గులాబ్‌సింగ్‌ ఉన్నారు. 

సాంకేతిక పద్ధతులపై రైతులకు అవగాహన

వ్యవసాయంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి సాగును లాభసాటిగా చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. మంగళవారం మావల మండలంలోని రైతు వేదిక భవనంలో వానాకాలం 2022కు సంబంధించి పంటల సాగు యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లస్టర్ల వారీగా వారు చేపడుతున్న కార్యక్రమాలు, రైతులకు అందిస్తున్న అవగాహన సదస్సుల గురించి అడిగి తెలుసుకున్నారు.పంటల సాగులో వస్తున్న ఆధునాతన మార్పు గురించి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తెలియజేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. పంట క్షేత్రాలను సందర్శించి వారు అనుసరిస్తున్న విధానల గురించి తెలుసుకుంటు సూచనలే సలహాలు ఇవ్వాలన్నారు.రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జిల్లాలో రైతు వేదికలను త్వరితగతిన పూర్తి చేశామన్నారు. మండల వ్యవసాయ అధికారులు నిత్యం అక్కడ ఉం టూ రైతుల సమస్యలపై సమాధానాలను ఇవ్వాలన్నారు. ఇక నుంచి రైతు వేదిక లే వ్యవసాయ శాఖ అధికారులకు కేంద్రంగా ఉండాలని సూచించారు. ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటు రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాషేక్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, ఏవో శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more