నేడు శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-04T04:56:24+05:30 IST

భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నేడు శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభం కానున్నాయి.

నేడు శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభం

భద్రాచలం, డిసెంబరు 2: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నేడు శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభం కానున్నాయి. దీక్షాధారణ సందర్భంగా కార్తీక పునర్వసును పురస్కరించుకొని భద్రుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ దీక్షలు 31వ తేదీన మార్గశిర పునర్వసు సందర్భంగా ముగియనున్నాయి. ముగింపు రోజున గిరి ప్రదక్షిణ, పాదుకాపూజ, దీక్ష విరమణ, వెండి రథోత్సవం నిర్వహించనున్నారు.   


Updated Date - 2020-12-04T04:56:24+05:30 IST