గెలుపే లక్ష్యం కావాలి

ABN , First Publish Date - 2021-03-01T06:23:08+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికతోపాటు ఎమ్మెల్సీ ఎన్ని కల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్‌రావు పిలుపునిచ్చారు.

గెలుపే లక్ష్యం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న మురళీధర్‌రావు

బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్‌రావు 

నల్లగొండ రూరల్‌, ఫిబ్రవరి 28: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికతోపాటు ఎమ్మెల్సీ ఎన్ని కల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్‌రావు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం  జరిగిన పదాధికారుల సమావేశంలో మాట్లా డారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్‌ పార్టీ సంస్కృతినే ఉద్యమ పార్టీ అలవర్చు కుందన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీ మరింత బలోపేతం కానుందన్నారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ పాలనను కోరు కుంటుంటున్నారని, ఇందుకు దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలే ని దర్శనమన్నారు. తెలంగాణలో అవినీతితో కూడిన కుటుంబపాలన కొనసాగు తోందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రస్తుతం చెదలుపట్టిందన్నారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఈ ఎన్నికలను రెఫరెండంగా భావించాలని సవాల్‌ విసిరారు. టీఆ ర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలు పునిచ్చారు. 1974వ సంవత్సరం తర్వాత ఉద్యోగులకు కేవలం 7.5శాతం ఫిట్‌ మెంట్‌ ఇవ్వాలని ఆలోచన చేసిన ఘనత ప్రస్తుత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, 40 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 14యూనివర్సిటీలుంటే 11 యూని వర్సిటీలకు వైస్‌ ఛాన్స్‌లర్లే లేరని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, గొంగిడి మనోహర్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్‌, నూకల నర్సింహారెడ్డి, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, సాంబయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T06:23:08+05:30 IST