త్వరగా స్థలసేకరణ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-05-20T05:47:30+05:30 IST

గ్రామీణ క్రీడాప్రాంగణాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలకు అనువైన స్థలాల సేకరణ రెండు రోజు ల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి రెవెన్యూ, పంచాయతీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఉపాధి హామీ అధికారులతో సమావేశం నిర్వహించారు.

త్వరగా స్థలసేకరణ పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పథి

గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు

కలెక్టర్‌ పమేలాసత్పథి


భువనగిరి రూరల్‌, మే 19: గ్రామీణ క్రీడాప్రాంగణాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలకు అనువైన స్థలాల సేకరణ రెండు రోజు ల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి రెవెన్యూ, పంచాయతీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఉపాధి హామీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు అనువుగా ఎకరం, ఎకరంన్నర స్థలాన్ని సేకరించాల ని, అదేవిధంగా మండలానికి ఐదు చొప్పున 85 బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో భాగంగా ఇప్పటివరకు 30స్థలాల సేకరణ పూర్తయిందని, మిగతా 55స్థలాల సేకరణ రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రతీ గ్రామంలో 150 మందికి పైగా కూలీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు డి శ్రీనివా్‌సరెడ్డి, దీపక్‌తివారీ, సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, డీ ఆర్‌డీవో మందడి ఉపేందర్‌ రెడ్డి, డీపీవో ఆర్‌ సునంద, అదనపు డీఆర్‌డీవో టి నాగిరెడ్డి తదితరులున్నారు.

 

స్ర్తీనిధి రుణాల్లో 92శాతం ప్రగతి 

2021-22 ఆర్థిక సంవత్సరంలో స్ర్తీనిధి రుణాలకు సంబంధించి 92శాతం ప్రగతి సాధించినట్లు కలెక్టర్‌ పమేలాసత్పథి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో స్ర్తీనిధి యాప్‌ను ప్రారంభించి మాట్లాడుతూ స్ర్తీనిధి ద్వారా రుణం పొందుతున్న సభ్యులు పారదర్శకంగా ఆర్థిక నిర్వహణ సాధించేందుకు స్ర్తీనిధి యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కాగా 2021-22లో స్ర్తీ నిధి రుణాల కింద రూ.105కోట్ల 85లక్షలకు గాను రూ.98కోట్ల 10లక్షల 47వేలను అందించి 92శాతం ప్రగతి సాధించామన్నారు.  


ఫెడరేషన్‌ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

చేతివృత్తుల ఆర్థిక పరిపుష్టికి ఫెడరేషన్‌ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. రాష్ట్ర మేదర ఫెడరేషన్‌ ద్వారా మంజూరైన రూ.50వేల చెక్కును  భూదాన్‌పోచంపల్లి మండలానికి చెందిన జె.విజయకు కలెక్టర్‌ అందజేశారు. 

Updated Date - 2022-05-20T05:47:30+05:30 IST