చదువుతో పాటు విలువలను పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2021-03-01T05:15:57+05:30 IST

విద్యార్థులు చదువుతో పాటు విలువలను పెంపొందించుకోవాలని ఐఐటీహెచ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ శశిధర్‌ సూచించారు.

చదువుతో పాటు విలువలను పెంపొందించుకోవాలి
విజేతలకు అందజేసిన సైకిల్స్‌తో ప్రొఫెసర్‌ శశిధర్‌

ఐఐటీహెచ్‌ ప్రొఫెసర్‌ శశిధర్‌

సంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 28 : విద్యార్థులు చదువుతో పాటు విలువలను పెంపొందించుకోవాలని ఐఐటీహెచ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ శశిధర్‌ సూచించారు. సంగారెడ్డిలోని రాయల్‌ జూనియర్‌ కళాశాలలో ఆదివారం ఇస్కాన్‌ హైదరాబాద్‌, భక్తి యోగా సెంటర్‌ సంగారెడ్డి సంయుక్తంగా నిర్వహించిన భగవద్గీత ఆధారిత విలువల విద్యా పోటీలలో పాల్గొని విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. సీనియర్‌ విభాగంలో సంగారెడ్డి టౌన్‌ టాపర్‌గా నిలిచిన విద్యార్థి వికా్‌సరెడ్డి, జూనియర్‌ విభాగంలో హరిణికి సైకిల్స్‌, తృతీయ స్థానంలో నిలిచిన వారికి స్మార్ట్‌వాచ్‌, పెన్‌డ్రైవ్‌లు అందజేశారు. స్కూల్‌ లెవల్‌ టాపర్స్‌గా నిలిచిన వారికి మెడల్స్‌తో పాటు పరీక్షలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్‌ అందజేశారు. పోటీల్లో 2064 మంది విద్యార్థులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తి యోగా సెంటర్‌ సంగారెడ్డి ఇన్‌చార్జి గజేంద్రనాధ్‌, ఐఐటీహెచ్‌ సభ్యులు ప్రొఫెసర్లు చంద్రశేఖర్‌, వెంకట్‌రావు, సంతోష్‌, రాధాకృష్ణ, అరుణ్‌, సిద్ధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T05:15:57+05:30 IST