తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి

ABN , First Publish Date - 2022-05-18T05:40:01+05:30 IST

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి
ఇబ్రహీంపట్నం రూరల్‌: దండు మైలారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న సత్యనారాయణ

ఇబ్రహీంపట్నం రూరల్‌/తలకొండపల్లి, మే 17: రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని ఇబ్రహీంపట్నం వ్యవసాయశాఖ సహయ సంచాలకులు సత్యనారాయణ అన్నారు.  దండుమైలారంలో నేరుగా విత్తే వరిసాగుపై రైతులకు మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పత్తి, మొక్కజొన్న, జొన్న తదితర ఆరుతడి పంటలు సాగు చేసినట్లుగానే వరి పంటలను నేలల్లో నేరుగా విత్తే సాగును రైతులు పాటించాలని అన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఏఈవో శ్రావణ్‌, రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా తలకొండపల్లి వెల్జాల రైతు వేదికలో గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నరేందర్‌గౌడ్‌ అధ్యక్షతన రైతులకు పంటల సాగుపై అవగాహన సమావేశం నిర్వహించారు. టీఆర్‌ఎ్‌స్‌ జిల్లా సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, ఏఈవో శిరీష, పంచాయతీ కార్యదర్శి శరత్‌, యాదయ్య, పెంటయ్య గౌడ్‌, వెంకట్‌రెడ్డి, మోహన్‌లాల్‌ పాల్గొన్నారు. చేవెళ్ల మండలంలోని  మోకిల గ్రామంలో  మోకిల పీఏసీఎస్‌ చైర్మన్‌ గోపాల్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి పీఏసీఎస్‌ వైఎస్‌ చైర్మన్‌ శశిధర్‌రెడ్డి, సర్పంచ్‌ సుమిత్ర, ఉపసర్పంచ్‌ రాజు, మాజీసర్పంచ్‌ ఆనంద్‌, ఏవో సురేశ్‌బాబు, ఏఈవో అనిత ఉన్నారు. అదేవిధంగా యాచారంలో మండల వ్యవసాయాధికారి సందీ్‌పకుమార్‌ రైతులకు పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పించారు. 

Updated Date - 2022-05-18T05:40:01+05:30 IST