పల్లెల్లో తిరిగి సమస్యలు తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-21T07:41:10+05:30 IST

జనసేన కార్యకర్తలు ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేయాలని జనసేనాని, ప్రముఖ సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

పల్లెల్లో తిరిగి సమస్యలు తెలుసుకోవాలి
చౌటుప్పల్‌లో ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్‌కల్యాణ్‌

 ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ 

పవన్‌ కల్యాణ్‌కు ఘన స్వాగతం 

 చౌటుప్పల్‌, వలిగొండ 20: జనసేన కార్యకర్తలు ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేయాలని జనసేనాని, ప్రముఖ సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వలిగొండ మండలం గోపరాజుపల్లి కి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ బీమా చెక్కు అందించడానికి శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో పవన్‌ కల్యాణ్‌ చౌటుప్పల్‌కు వచ్చారు. ఉదయం 11.27గంటలకు చౌటుప్పల్‌కు చేరుకున్నారు. పవన్‌ రాక కోసం అభిమానులు రెండు గంటల ముందు నుంచి చౌటుప్పల్‌లో నిరీక్షించారు. 10 వాహనా ల కాన్వాయ్‌తో చౌటుప్పల్‌ కు చేరుకున్న అధినేతకు భారీ స్వాగతం లభించింది. జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసిన కార్యక్ర మం వేదిక వద్దకు వస్తున్న పవన్‌కు అభిమానులు పూలు చల్లి స్వాగతం పలికారు పవన్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటి పడ్డారు. సీఎం పనన్‌ కల్యాన్‌ అంటు నినదాలు చేశారు. కార్యక్రమం ముగించి తిరిగి వెళ్లే సమయంలో అభిమానులు భారీ గజమాలను క్రేన్‌ సహయంతో మెడలో వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్‌తో సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు. 

తెలంగాణలో జనసేన పార్టీ పోటీ

 ఈ సందర్భంగా పవన్‌  కల్యాణ్‌ విలేకరులతో మా ట్లాడుతూ తెలంగాణలో జన సన పార్టీ పోటీ చేస్తుందన్నారు. ప్రజా సమస్యలను పార్టీ  కార్యకర్తలు  తెలుసుకుని, వాటి పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు. తాను కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో  ఏమీ ఆశించని తాను తెలంగాణలో ఏమి అశిస్తానని ఆయన  అన్నారు. 

 పవన్‌ సారే మా ధైర్యం  

 సుమతి, మృతుడు సైదులు భార్య 

చౌట్పుపల్‌: రోడ్డు ప్రమాదంలో గా యపడిన నా భర్త కొంగరి సైదులుకు హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులో వైద్యం చేయించగా రూ.15లక్షలు ఖర్చయింది. అయినా భర్త ప్రాణం దక్కలేదు.  గుంట భూమి, జాగా ఏమీ మా కు లేదు.  కాయకష్టం చేసైనే మాకు పూట గడుస్తుంది. మాకు మగ్గురు పిల్లలకు పవన్‌ కల్యాణ్‌కు ఇష్టమైన (అఖిరానందన్‌, సిద్ధు, చరణ్‌) పేర్లు పెట్టుకున్నాం. భర్త మృతితో పిల్లలతో నేను ఆత్మహత్య చేసుకుందామనుకు న్నాను.    ఆ సమయంలో మా గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు ధైర్యం చెప్పారు.  ఇప్పటివరకు మాకు ఎవరూ సాయం చేయలే. పవన్‌ సారే మా కుటుంబానికి ధైర్యం.. భరోసా.   నా భర్త మృతి చెందిన నాలుగు నెలలకే  నా చిన్నకుమారుడు సిద్ధును టిప్పర్‌ ఢీకొనడంతో కాలు, చేయి విరిగింది.  కూలినాలి చేసుకుని వైద్యం చేయించడంతో పాటు పిల్లలను సాకుతున్నా.


పర్యటన ఇలా..

8 11:27  పవన్‌ కల్యాణ్‌  చౌటుప్పల్‌కు చేరుకున్నారు. 

8 11:30  కార్యక్రమ వేదిక వద్దకు వచ్చారు. 

8 11:32 సైదులు చిత్రపటానికి నివాళులర్పించారు. 

8 11:33 నుంచి 12:05 వరకు సైదులు కుటుంబ

   సభ్యులతో మాట్లాడారు. 

8 12:10 విలేకర్ల సమావేశం ప్రారంభించారు. 

8 12:50 సమావేశాన్ని ముగించారు. 

8 12:55పవన్‌ కార్యక్రమ వేదిక నుంచి తిరిగి వెళ్లారు. 

8  1:00 పవన్‌ను భారీ గజమాలతో సన్మానించారు. 

8 1:10 ఓపెన్‌ టాప్‌ కారులో జాతీయ రహదారి 

    మీదుగా తిరిగి వెళ్లారు. 



Updated Date - 2022-05-21T07:41:10+05:30 IST