ప్రణాళికతో ముందుకెళ్లాలి

ABN , First Publish Date - 2022-06-30T05:01:35+05:30 IST

విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకునేలా ప్రణాళికతో ముందు కెళ్లాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు.

ప్రణాళికతో ముందుకెళ్లాలి
ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులతో కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

-కేజీబీవీల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను ఘనంగా సత్కరించిన కలెక్టర్‌ 


నాగర్‌కర్నూల్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకునేలా ప్రణాళికతో ముందు కెళ్లాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌  అన్నారు. జిల్లాలో ని  కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వి ద్యార్థినులను కలెక్టర్‌ శాలువాతో సత్కరించి అభినందిం చారు. కలెక్టరేట్‌లో కేజీబీవీల్లో మంచి మార్కులు సా ధించిన విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఎస్‌వోలతో కలిసి బుధవారం  కలెక్టర్‌ను కలిశారు.  ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అమ్మాయిలు ప్రణాళిక తో ముందుకెళ్తే  చదువుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సూచించారు. విద్యార్థులకు పలు సూ చనలు సలహాలు అందజేయడంతోపాటు విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందించాలని తల్లిదండ్రులను కోరారు. మడుముల ఏజెన్సీ ప్రాంతమైన అమ్రాబాద్‌ కేజీబీవీల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడం మంచి శుభపరిణామంగా కలెక్టర్‌ అభినందించారు. విద్యార్థుల ఉన్నతికి కృషి చేసిన కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉ పాధ్యాయులను కలెక్టర్‌ అభినందించారు. నేరుగా కేజీ బీవీలను సందర్శించి అభినందనలు తెలియజేస్తానని అన్నారు. బల్మూరు, లింగాల, అమ్రాబాద్‌ కేజీబీవీల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన ఎస్‌వోలను కలెక్టర్‌ సత్కరించారు. జిల్లాలో కేజీబీవీలో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేసిన విద్యాశాఖ అధికారి గోవిందరా జులు, సూర్య చైతన్యలను కలెక్టర్‌ అభినందించారు. ఇదేవిధంగా కేజీబీవీల అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన కోరారు. డీఈవో గోవిందరాజులు, కేజీబీవీల పర్యవేక్షణ అధికారిణి సూర్య చైతన్య, ఆయా కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యా ర్థినులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 


అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌కార్డులు

 అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు. కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అధ్యక్షతన కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం నిర్వహిం చారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోఎస్‌ నెంబరు 239 ద్వారా జారీ అయిన తెలంగాణ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్‌ నిబంధనలలో నిర్దేశించిన అర్హతలు కలి గిన 456మంది దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన జర్నలిస్టులకు మొదటి విడతగా 2022-2024 వార్షిక కాలానికి అక్రిడిటేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు క లెక్టర్‌ తెలిపారు. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్లు సరిగ్గా సమర్పించని వారు, సాంకేతిక సమస్యల వల్ల ఏవైనా తిరస్కరణకు గురైతే వాటిని తదుపరి అక్రిడేషన్‌ సమాఏశంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సీతారాంనాయక్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌ ధరమ్‌సింగ్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా రేడియో ఇంజనీర్‌ ఇస్రానా యక్‌, మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు మహమ్మద్‌ అబ్దుల్లాఖాన్‌, సురేష్‌, సుదర్శన్‌రెడ్డి, పరిపూర్ణం, టి.విజయ్‌, కపిలవాయి రాజు, మాధవరెడ్డి, విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-30T05:01:35+05:30 IST