తీరప్రాంత పరిశుభ్రతలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2022-10-03T06:38:36+05:30 IST

సాగరతీర స్వచ్ఛతలో భాగంగా తీరప్రాంత పరిశుభ్ర తకు చేపడుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున పిలుపునిచ్చారు.

తీరప్రాంత పరిశుభ్రతలో భాగస్వాములు కావాలి
తీరంలో చెత్త ఏరుతున్న కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున

విశాఖపట్నం, అక్టోబరు 2: సాగరతీర స్వచ్ఛతలో భాగంగా తీరప్రాంత పరిశుభ్ర తకు చేపడుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున పిలుపునిచ్చారు. జోడుగుళ్లపాలెం తీరంలో కలెక్టర్‌ సూచన మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్‌జీవోలు, స్థానికులతో కలిసి బీచ్‌ క్లీన్‌ డ్రైవ్‌ను ఆదివారం ఉద యం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతినెల మొదటి ఆదివా రం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా బీచ్‌ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాలు నిర్మూ లించడమే లక్ష్యమని తెలిపారు.


బీచ్‌కి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటున్నందున ప్లాస్టిక్‌ వ్యర్థాలు వినియోగించకుండా వారిని చైతన్యపరచాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌, పలు విభాగాలకు చెందిన జీవీఎంసీ అధికారులు, ఎన్‌జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన సైకత శిల్పంను కలెక్టర్‌ పరిశీలించి ఫొటో దిగారు. 

Updated Date - 2022-10-03T06:38:36+05:30 IST