ఊహించలేదు.. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయా..!

ABN , First Publish Date - 2021-11-03T13:27:42+05:30 IST

ఊహించలేదు.. ఫలితాలు చూసిన..

ఊహించలేదు.. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయా..!

కొవిడ్‌ పరిస్థితుల స్ఫూర్తితోనే డాక్టర్‌ కావాలనుకున్నా

నీట్‌ ఆలిండియా టాపర్‌ మృణాల్‌ కుట్టేరి


హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): కరోనా కాలం నాటి పరిస్థితులే వైద్య వృత్తిపై ఆసక్తిని పెంచాయని అంటున్నాడు... నీట్‌ ఫలితాల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన మృణాల్‌ కుట్టెరి. ఇంటర్‌ ‘కరోనా బ్యాచ్‌’ అయినప్పటికీ ప్రణాళిక ప్రకారం చదివి విజయం సాధించానని మృణాల్‌ చెప్పాడు. తన విజయ ప్రస్థానాన్ని ‘ఆంధ్రజ్యోతి’కి ఇలా వివరించాడు...


మా పూర్వీకులది కేరళ. చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాం. సఫిల్‌గూడలో ఉంటున్నాం. 9వ తరగతిలో ఉన్నప్పుడే డాక్టర్‌ కావాలనుకున్నా. టెన్త్‌లో 10 గ్రేడ్‌ పాయింట్లు వచ్చాయి, కానీ ఇంటర్‌ ‘కొవిడ్‌ బ్యాచ్‌’. కరోనా పరిస్థితులతో ఫస్టియర్‌ పరీక్షలు సరిగా రాయలేదు, సెకండియర్‌ పరీక్షలు అసలు నిర్వహించలేదు. డాక్టర్‌గా పనిచేయాలంటే ఎన్ని సవాళ్లుంటాయో, ఎంత ధైర్యం కావాలో కొవిడ్‌ సమయంలోనే తెలుసుకున్నాను. అప్పటి నుంచి డాక్టర్‌ ప్రొఫెషన్‌పై ఆసక్తి పెరిగింది. ఇంట్లో అమ్మ, నాన్న కూడా ప్రోత్సహించారు. కానీ ఆలిండియా స్థాయిలో ఫస్ట్‌ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. ఫలితాలు చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్‌ చదివి.. సివిల్‌ సర్జన్‌గా స్థిరపడాలనుకుంటున్నాను.

Updated Date - 2021-11-03T13:27:42+05:30 IST