NEETపై తగ్గేదే లేదు

ABN , First Publish Date - 2022-01-09T15:56:21+05:30 IST

నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలో శనివారం ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. ఇందుకు న్యాయనిపుణులతో సంప్రదించి భవిష్యత్‌ కార్యచరణకు దిగాలని

NEETపై తగ్గేదే లేదు

- న్యాయనిపుణులతో సంప్రదించి  భవిష్యత్‌ కార్యాచరణ

- అఖిలపక్ష తీర్మానం 

- బీజేపీ ఎమ్మెల్యే వాకౌట్‌


చెన్నై: నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలో శనివారం ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. ఇందుకు న్యాయనిపుణులతో సంప్రదించి భవిష్యత్‌ కార్యచరణకు దిగాలని తీర్మానించింది. సీఎం ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, పీఎంకే, బీజేపీ, డీపీఐ, ఎండీఎంకే సహా 13 పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశానికి బీజేపీ ప్రతినిధిగా హాజరైన ఆ పార్టీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌ వాకౌట్‌ చేయడం గమనార్హం. నీట్‌ మినహాయింపు బిల్లు ప్రస్తుతం గవర్నర్‌ పరిశీలనలో ఉంది. నీట్‌ను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్‌  నుంచి మినహాయింపు పొందటంలో తీవ్ర జాప్యం ఏర్పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టిసారించి అఖిపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 


రద్దు చేయాల్సిందే!

నీట్‌ నుంచి మినహాయింపే అన్ని పార్టీల ప్రధాన లక్ష్యంగా వుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నా రు. అఖిలపక్ష సమావేశంలో ఆయన ప్రారంభో పన్యాసం చేస్తూ నీట్‌ పరీక్షలకు పుల్‌స్టాప్‌ పెట్టడమే తన ఆశ యమన్నారు. రాష్ట్రంలో డీఎంకే అధికారం లోకి రాగానే గత జూన్‌ 17న ఢిల్లీలో ప్రధాని మోదీని తాను స్వయంగా కలిసి నీట్‌ నుంచి రాష్ట్రాని కి మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు గుర్తు చేశారు. ఈ విషయమై ఉభయ సభల్లో డీఎంకే ఎంపీలు పలుమార్లు ఒత్తిడి చేశారని, తరువాత సెప్టెంబర్‌ 13న నీట్‌ మినహాయింపు బిల్లును శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్‌కు పంపామన్నారు. నెలలు గడిచినా గవర్నర్‌ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని స్టాలిన్‌ ఆరోపిం చారు. శాసనసభ తీర్మానాన్ని గౌరవించి గవర్నర్‌ ఆమోదించటమే ప్రజాస్వామ్య లక్షణమని, ఈ విషయమై గవర్నర్‌ను తాను స్వయంగా కలుసుకుని నీట్‌ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించాలంటూ విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా గవర్నర్‌ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపక పోవడంతో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించే నిమిత్తం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిం దని స్టాలిన్‌ తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం చేయనున్న తీర్మానానికి అఖిలపక్ష సభ్యులందరూ మద్దతివ్వాలని కోరారు. ఆ మేరకు నీట్‌ మినహాయింపు కోసం సీని యర్‌ న్యాయ నిపుణులతో సంప్ర దించిన మీదట భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకోవాలన్న తీర్మా నాన్ని మంత్రి సుబ్రమణ్యం సమావేశంలో ప్రతిపా దించారు. దీనికి అన్ని పార్టీల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు దురై మురుగన్‌, పొన్ముడి, అన్నాడీఎంకే తరఫున మాజీ మంత్రి డాక్టర్‌ సి.విజయ భాస్కర్‌, కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ శాసన సభాపక్ష నాయకుడు సెల్వ పెరుందగై,  పీఎంకే అధ్యక్షుడు జీకే మణి, సీపీఐ తరఫున డీ రాజేంద్రన్‌, సీపీఎం తరఫున వీపీ నాగై మాలి, ఎండీఎంకే తరఫున డాక్టర్‌ డి.సదన్‌ తిరుమలై కుమార్‌, డీపీఐ తరఫున ఎం.చిందనైసెల్వన్‌, కొంగు నాడు మక్కల్‌ దేశియ కట్టి నాయకుడు ఈఆర్‌ ఈశ్వరన్‌, తమిళగ వాళ్వురిమై తరఫున వేల్‌మురు గన్‌, మనిదనేయ మక్కల్‌ కట్చి నాయకుడు జవాహిరుల్లా, పురట్చి భారతం నాయకుడు పూవై జగన్‌ మూర్తి, ప్రభుత్వ ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.

బీజేపీ నిరసన...

అఖిలపక్ష సమావేశానికి హాజరైన బీజేపీ మహిళా నేత, ఆ పార్టీ శాసన సభ్యురాలు వానతి శ్రీనివాసన్‌ అర్థాంతరంగా వాకౌట్‌ చేశారు. అనంతరం సమావేశపు హాలు బయట ఆమె మీడియాతో మాట్లాడు తూ... అఖిలపక్ష సమావేశంలో విద్యార్థుల అడ్మి షన్లపై రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని కేంద్ర హరించి వేసిందనటాన్ని వ్యతిరేకిస్తూ సమావేశం నుండి వాకౌట్‌ చేసినట్లు తెలిపారు. రాష్ట్రాల్లో ప్రారంభించే వైద్యకళాశాలలకు కేంద్రం 60 శాతం , రాష్ట్ర ప్రభు త్వాలు 40 శాతం నిధులు కేటాయిస్తున్నాయని సమావేశంలో తాను తెలియజేశానని చెప్పారు. నీట్‌ ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై బలవంతంగా రుద్దిన ట్లు అఖిలపక్ష సమావేశంలో పేర్కొనటం కూడా సబబు కాదని, వాస్తవానికి నీట్‌కు శ్రీకారం చుట్టింది గత యూపీఏ ప్రభుత్వమేనని ఆమె స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే దేశమంతటా నీట్‌ పరీక్షలు జరుగుతున్నాయని, అలాంటప్పుడు నీట్‌ నిర్వహణ సామాజిక న్యాయానికి వ్యతిరేక మంటూ డీఎంకే ప్రభుత్వం ఆరోపించడం కూడా సమం జసంగా లేదన్నారు.


పీఎంకే మద్దతు...

నీట్‌ రద్దు కోసం డీఎంకే ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు పీఎంకే మద్దతు ప్రకటించింది. అఖిలపక్ష సమావేశంలో పీఎంకే ప్రతినిధిగా హాజరైన ఆ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ్యుడు జీకే మణి మాట్లాడుతూ నీట్‌ నిర్వహణ సామాజిక న్యాయాయానికి వ్యతిరేక మైనదని ఆరోపించారు. నీట్‌ నుంచి రాష్ట్రాన్ని మిన హాయించాలనే పీఎంకే కోరుతోందని చెప్పారు.


అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం : మంత్రి సుబ్రమణ్యం

నీట్‌ వ్యవహారంపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అవకాశం ఇస్తే అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా వున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం ప్రకటించారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... నీట్‌ నుంచి మినహాయింపు పొందే విషయమై అఖిలపక్ష సమావేశంలో కూలంకషంగా చర్చించామని తెలి పారు. నీట్‌ కోరుతూ ఇటీవల ఢిల్లీలో డీఎంకే ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారని తెలిపారు. అమిత్‌షా దానిపై స్పందించి ఆహ్వానిస్తే అఖిలపక్ష సభ్యులతో తాము ఢిల్లీ వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి నీట్‌ మిన హాయింపు కోసం భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిం చటానికి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరపాలని అఖిల పక్ష సభ్యులు నిర్ణయించారని ఆయన చెప్పారు. న్యాయకోవిదుల అభిప్రాయాలు, సూచనలు తెలు సుకున్న తర్వాత మళ్ళీ అఖిలపక్షంతో కలిసి భవిష్యత్‌ కార్యాచరణకు దిగుతామని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.


గవర్నర్‌ను రీకాల్‌ చేయాలి: కాంగ్రెస్‌, డీపీఐ

అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌, డీపీఐ ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశా నికి హాజరైన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నాయకుడు సెల్వ పెరుందగై మీడియాతో మాట్లాడుతూ... రాజ్యాంగ ధర్మాసనం 200 సెక్షన్‌ ప్రకారం శాసనసభ తీర్మానంపై గవర్నర్‌ ఆమోదించటమో లేక రాష్ట్రపతి పరిశీలనకు పంపటమో చేయాలని, అలాంటి శాసనసభలో ఆమోదించిన నీట్‌ మినహాయింపు బిల్లుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గర్హనీయ మని పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న గవర్నర్‌ను రీకాల్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-01-09T15:56:21+05:30 IST