ర్యాపిడ్‌ టెస్టుల్లో నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదం

ABN , First Publish Date - 2021-04-17T06:17:56+05:30 IST

ర్యాపిడ్‌ టెస్టులలో నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదం సంభవిస్తుందని డీఎంహెచ్‌వో బాలనరేందర్‌ అన్నారు. శుక్రవారం రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కొవిడ్‌ టెస్టులు, తదితర విషయాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి వసతులపై

ర్యాపిడ్‌ టెస్టుల్లో నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదం
కందకుర్తి చెక్‌పోస్టు వద్ద ర్యాపిడ్‌ టెస్టుల గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీఎంహెచ్‌వో బాలనరేందర్‌

రెంజల్‌, ఏప్రిల్‌ 16: ర్యాపిడ్‌ టెస్టులలో నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదం సంభవిస్తుందని డీఎంహెచ్‌వో బాలనరేందర్‌ అన్నారు. శుక్రవారం రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కొవిడ్‌ టెస్టులు, తదితర విషయాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి వసతులపై డాక్టర్‌ క్రిస్టీనాను అడిగి తెలుసుకున్నారు. కరోనా పట్ల ప్రతీఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. ఆసుపత్రిలో గల మెటర్నటి వార్డులను ప్రసవాలు, తదితర గదులను ఆయన పరిశీలించారు. వ్యాక్సిన్‌ను ప్రజలకు అందజేయడం సంతోషకరమని ఆయన సూచించారు. అనంతరం కందకుర్తి చెక్‌పోస్టు వద్ద వైద్య సేవలు ర్యాపిడ్‌ టెస్టులుక, తదితర విషయాలను పరిశీలించారు. డీఎంహెచ్‌వో ఉన్న సమయంలో ఏడుగురికి వైద్యపరీక్షలు నిర్వహించగా.. ఇద్దరు మహారాష్ట్ర వ్యక్తులకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కిట్లను ఇచ్చి మహారాష్ట్రకు పంపి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించా రు. అక్కడి నుంచి వస్తున్న ప్రతీ వ్యక్తిని ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించాలని  సూచించారు. ప్రతీఒక్కరు మాస్క్‌లు ధరించి భౌతికదూరం పాటించేలా అవగాహన కల్పించాలని, ఈ తరహాలో సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట డాక్టర్‌ క్రిస్టీనా, వైద్య సిబ్బంది ఉన్నారు.

సాలూర చెక్‌పోస్టు వద్ద తనిఖీ

బోధన్‌: మండలంలోని సాలూర అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టును శుక్రవారం జిల్లా వైద్యాధికారి బాలనరేందర్‌ తనిఖీ చేశారు. సాలూర చెక్‌పోస్టుకు తొలిసారిగా వచ్చిన ఆయన కరోనా కట్టడి కోసం చెక్‌పోస్టులో చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర ప్రాంతం నుంచి తెలంగాణ భూభాగంలోకి రాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అడిగి తెలుసు కున్నారు. మహారాష్ట్రవాసులు ఒకవేళ సరిహద్దులు దాటి వస్తే తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని తిరిగి వెనక్కి పంపాలని ఆయన సూచించారు. ఆయన వెంట సాలూర పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ రేఖ, టీఆర్‌ఎస్‌ నాయకులు బుద్దె రాజేశ్వర్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-04-17T06:17:56+05:30 IST