రేషన షాపులకు చేరని సరుకులు

ABN , First Publish Date - 2021-11-01T06:29:47+05:30 IST

జిల్లాలోని రేషన షాపులకు బియ్యం సరఫరాలో తీవ్ర నిర్ల క్ష్యం జరుగుతోంది. ప్రతి నెలా 20వ తేదీలోగా బియ్యం, ఇతర సరుకులు కేటాయించేవారు.

రేషన షాపులకు చేరని సరుకులు

బియ్యం సరఫరాలో నిర్లక్ష్యం

ఇప్పటి దాకా 22.19 శాతమే సరఫరా 

కందిపప్పు, చక్కెర కేటాయింపులతోనే సరి 

ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపంతో 

లబ్ధిదారులకు తప్పని ఇబ్బందులు 

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 31 :  జిల్లాలోని  రేషన  షాపులకు బియ్యం సరఫరాలో తీవ్ర నిర్ల క్ష్యం జరుగుతోంది. ప్రతి నెలా 20వ తేదీలోగా బియ్యం, ఇతర సరుకులు కేటాయించేవారు. ఆ వెంటనే డీలర్లతో డీడీలు కట్టించుకునేవారు. నెలాఖరులోగా ఎఫ్‌పీ షాపులకు బియ్యం, ఇతర సరుకులు చేర్చేవారు. నవంబరు నెలకు సం బంధించిన కోటా కేటాయింపులు ఐదు రో జులు ఆలస్యంగా జరిగినట్లు సమాచారం. మరోవైపు గోనె సంచులకు డబ్బులు చెల్లించాలని డీలర్లు సరుకు లు లిఫ్ట్‌ చేయకుండా రెండు రోజులు నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆశించిన స్థాయిలో మండల స్థాయి స్టాక్‌ పాయింట్ల నుంచి ఎఫ్‌పీ షాపులకు సరుకులు సరఫరా  జరగలేదు. దీని ప్రభావం సరుకుల పంపిణీపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. 


ఎఫ్‌పీ షాపులకు చేరని సరుకులు 

జిల్లా వ్యాప్తంగా 3 వేల ఎఫ్‌షాపుల పరిధిల్లో 12 లక్షల దాకా బియ్యం కార్డులున్నాయి. నవంబరు నెలకు సంబం ధించి జిల్లాకు 18268 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయించారు. ఇందులో 15123 మెట్రిక్‌ టన్నుల బియ్యం కోసం ఇండెంట్‌ ఇచ్చారు. ఇప్పటి దాకా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి 11939 మెట్రిక్‌ టన్నులు లిఫ్ట్‌ చేయగా ఆదివారం సాయంత్రం దాకా కేవలం 2649 మెట్రిక్‌ టన్నులు (22.19 శాతం)  మాత్రమే ఎఫ్‌పీ షాపులకు చేరాయి. పంపిణీకి ఒక రోజు ముందు వరకు ఆశించిన స్థాయిలో బియ్యం సరఫరా చేయకపోవడంతో డీలర్లు, ఎండీయూ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేస్తామని జేసీ నిశాంతకుమార్‌ ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో ఆశించిన మేరకు సరుకులు ఎఫ్‌పీ షాపులకు చేరకపోవడంతో పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. 


కందిపప్పు, చక్కెర కేటాయింపులతో సరిపెట్టిన వైనం 

జిల్లాకు నవంబరు నెలకు సంబంధించి 1136 మెట్రిక్‌ టన్నులు చక్కెర, 1110 మెట్రిక్‌ టన్నులు కంది బేడలు కేటాయించారు. ఇందులో 109 మెట్రిక్‌ టన్నులు చక్కెర, 315 మెట్రిక్‌ టన్నులు కంది బేడలకు అలాట్‌మెంట్‌ ఇచ్చారు. నవంబరు నెలకు సంబంధించి మండల స్థాయి స్టాక్‌ పాయింట్లకు ఆశించిన స్థాయిలో  చక్కెర, కంది బేడలు స్టాక్‌ రాలేదు. దీంతో ఎఫ్‌పీ షాపులకు పంపలేదు. కేవలం అంగనవాడీ కేంద్రాలకు కందిపప్పు పంపడంతో సరిపెట్టారు. గత నెలలో సగం శాతం డీలర్లకు డీడీలు చెల్లించినప్పటికీ చక్కెర, కందిబేడలు సరఫరా చేయలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో నవంబరు నెలలో బియ్యం మాత్రమే పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చక్కెర, కందిపప్పు ధరలు పెంచడంతోపాటు స్టాక్‌ పంపక పోవడంపై లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-11-01T06:29:47+05:30 IST