మౌలిక వసతులపై నిర్లక్ష్యం.. భారాలు మోపేందుకే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-05-20T06:11:43+05:30 IST

ప్రజలపై అదనపు భారాలు మోపేందుకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం పేదలకు మౌలిక వసతుల కల్పనను పట్టించుకోవడంలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

మౌలిక వసతులపై నిర్లక్ష్యం.. భారాలు మోపేందుకే ప్రాధాన్యం
జక్కంపూడిలో కరపత్రాలను పంపిణీ చేస్తున్న దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు

బాదుడే.. బాదుడులో దేవినేని ఉమా

గొల్లపూడి/విజయవాడ రూరల్‌, మే 19 : ప్రజలపై అదనపు భారాలు మోపేందుకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం పేదలకు మౌలిక వసతుల కల్పనను పట్టించుకోవడంలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.  జక్కంపూడి వైఎస్సార్‌ గ్రామ పంచాయతీలో బాదుడే - బాదుడు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.  స్థానికులు పట్టణ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు లేకపోవడంతో వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవని స్థానికులు చెప్పారు.  కాలనీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. విద్యుత్‌, బస్‌ చార్జీలను పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారన్నారు. జగన్‌ పాలనపై ప్రజలు రెఫరెండం ఇస్తన్నారని, గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బొమ్మసాని సుబ్బారావు, సాధనాల వెంకటేశ్వరమ్మ, సాధనాల ప్రసాద్‌, నర్రా వాసు, నూతనలపాటి వెంకటేశ్వరరావు(నారద), గుడపాటి పద్మశేఖర్‌, వడ్లమూడి చలపతిరావు, గరికపాటి శివ, షేక్‌ కరిముల్లా, తొటకూర జయరావు, కోరాడ మురళీకృష్ణ, బోయిన సుబ్రహ్మణ్యం, రంగినేని నరేంద్ర, బొర్రా పున్నారావు, మెండెం జమలయ్య, ధారావత్‌ శ్రీను నాయక్‌, దూళిపాళ రమేష్‌, వెంపరాల అమరేశ్వరరావు, గర్నేపూడి మాధవరావు, రాయుడు శ్రీనివాసరావు, గంధం సుబ్బారావు, పసుపులేటి జమలయ్య, బోయనపల్లి నాగేశ్వరరావు, నంబూరు శ్యామ్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.


ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట బైఠాయింపు

గొల్లపూడి : జేఎన్‌యూఆర్‌ఎం కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం బైఠాయించి నిరసన తెలిపారు.  కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిలో వైద్యులు లేకపోవటంతో పాటు కనీసం మందులు ఇచ్చే పరిస్థితి కూడ లేదని ప్రజలు చెప్పడంతో  ఆసుపత్రి ఎదుట బైఠాయించి వైద్యులు, జిల్లా అధికారులతో మాట్లాడారు.  కనీసం వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పాటు రోగులకు మందులు కూడ ఇచ్చే పరిస్థితి లేకపోవటం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న గంజాయి బ్యాచ్‌ను అరికట్టేందుకు పోలీసులు రావాలని నినాదాలు చేశారు. 


నయవంచక పాలన.. : కోగంటి బాబు

కంచికచర్ల రూరల్‌ : రాష్ట్రంలో ప్రజా వంచక పాలన సాగుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు కోగంటి బాబు అన్నారు.  పరిటాల లో గురువారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.  ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ ప్రజా వంచక పాలనను ప్రజలకు వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను కల్లబొల్లి మాటలతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T06:11:43+05:30 IST