జోడేఘాట్‌ మ్యూజియం నిర్వహణపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-08T04:21:06+05:30 IST

ఆదివాసీ ఆరాధ్యదైవం కుమరం భీం పోరుగడ్డలోని గిరిజన మ్యూజియం నిర్వహణ సక్రమంగా లేదు. రెండేళ్ల నుంచి క్యూరేటర్‌ లేకపో వడంతో పర్యాటకులు, సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.

జోడేఘాట్‌ మ్యూజియం నిర్వహణపై నిర్లక్ష్యం

4 జోడేఘాట్‌లోని గిరిజన మ్యూజియం

- క్యూరేటర్‌ లేక ఇబ్బందులు
- రెండేళ్ల క్రితం క్యూరేటర్‌కు, గ్రామస్థులకు మధ్య గొడవ
- ఇక్కడ ఉండలేమని వెళ్లిపోయిన సిబ్బంది
- కొత్త సిబ్బంది నియామకానికి ప్రకటన జారీ చేసి రెండేళ్లు
- నేటికీ నియామకాలు చేపట్టని అధికారులు

కెరమెరి, మే 7: ఆదివాసీ ఆరాధ్యదైవం కుమరం భీం పోరుగడ్డలోని గిరిజన మ్యూజియం నిర్వహణ సక్రమంగా లేదు. రెండేళ్ల నుంచి క్యూరేటర్‌ లేకపో వడంతో పర్యాటకులు, సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. 2018లో మ్యూజియం ప్రారంభిం చారు. నిర్మాణపనులు మొత్తం పర్యాటకశాఖ ఆధ్వ ర్యంలో కొనసాగాయి. కానీ నిర్వహణ ఏశాఖ ఆధ్వ ర్యంలో చేపట్టాలి అనేవిషయం స్పష్టత లేకపోవడంతో చివరకు ఐటీడీఏకు అప్పగించారు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా మ్యూజియంను పట్టించుకున్న నాథుడే లేడు.
క్యూరేటర్‌కు, గ్రామస్థులకు
మధ్య గొడవ

రెండేళ్ల క్రితం శ్మశాన వాటిక స్థలం ఎంపిక విషయంలో క్యూరే టర్‌కు, గ్రామస్థులకు మధ్య వివాదం జరిగింది. ఆ వివాదం కారణంగా క్యూరేటర్‌తో పాటు అటెండ ర్‌లు తాము ఇక్కడ విధులు నిర్వహించలేమని రాజీనామా చేసి వెళ్లిపోయారు. అనంతరం పర్యా టకులు, స్థానికుల వినతి మేరకు హడావుడిగా క్యూరేటర్‌, అటెండర్‌ నియామకం కోసం ప్రకటన జారీ చేసి దరఖాస్తులు స్వీకరించారు. అది పూర్తై రెండేళ్లవుతున్నా నేటికీ నియామకాలు చేపట్ట లేదు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధి కారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినాఫలితం లేకుం డా పోయిందని స్థానికులు వాపోతున్నారు. తప్పని పరిస్థితిలో సందర్శకులు వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులే క్యూరేటర్‌ పాత్ర పోషిస్తున్నారు. ఉపాధ్యాయులే మ్యూజియంను చూపించాల్సిన దుస్థితి నెలకొంది. దానితో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, సేద తీరడానికి వెయిటింగ్‌ హాల్‌, క్యాంటిన్‌ వంటి సదుపాయాలు లేక పర్యాట కులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బేస్‌ క్యాంపు నుంచి బాబేఝరి వరకు చేపట్టిన రోడ్డు పనులు అటవీ అనుమతులు లేక పోవడంతో నిలిచి పోయాయి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించి తగినసౌకర్యాలు కల్పించాలని స్థాని కులు కోరుతున్నారు.
క్యూరేటర్‌ను నియమించాలి
-పెందూర్‌రాజేష్‌, జోడేఘాట్‌

అధికారులు స్పందించి వెంటనే క్యూరేటర్‌ను నియమించాలి. దర ఖాస్తులు స్వీకరించి రెండేళ్లు అవుతోంది. నేటికీ నియా మకాలు చేపట్టలేదు. సందర్శకులు ఇ్బందులు పడు తున్నారు. ఐటీడీఏ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే క్యూరేటర్‌ను నియమించేలా చర్యలు చేపట్టాలి.

Read more