ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో భోజ్‌పురి గానాభజానా... యోగికి అనుకూల, వ్యతిరేక పాటలు...

Published: Mon, 17 Jan 2022 18:36:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో భోజ్‌పురి గానాభజానా... యోగికి అనుకూల, వ్యతిరేక పాటలు...

ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల వేడి పూర్తిగా రాజుకుంది. ఒకవైపు యోగి, మోదీ సైన్యం మోహరిస్తే... మరోవైపు అఖిలేశ్ సహా ఇతర పార్టీలన్నీ అధికారం కైవసం చేసుకోవటం కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు పాటలతో పాట్లు పడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. 


భోజ్‌పురి గాయని నేహా రాథోర్ ‘యూపీ మే కా బా’ అనే పాటని తాజాగా విడుదల చేసింది. అందులో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బాణీ కట్టి మరీ విమర్శించింది. కోవిడ్ మరణాలకు సంబంధించి పాటలో అనేక విమర్శలున్నాయి. అలాగే, హింసాత్మకమైన లఖింపూర్ ఖేరీ ఘటన గురించి కూడా ‘యూపీ మే కా బా’ పాటలో పదునైన పదాలు యోగిని, బీజేపీని ఉద్దేశించి వాడారు. అయితే, యోగి వద్దంటూ విడుదలైన ఈ తాజా పాట అంతకంటే ముందే మార్మోగిన కమలం పార్టీ అనుకూల గీతం వల్ల పుట్టుకొచ్చింది... 


బీజేపీ ఎంపీ, భోజ్‌పురి స్టార్ రవి కిశన్ ‘యూపీ మే సబ్ బా’ అంటూ మొదట కచ్చేరి మొదలు పెట్టారు. ఆయన తమ పార్టీకి అనుకూలంగా పాట విడుదల చేశారు. అందులో గత అయిదు సంవత్సరాల్లో యోగి విజయాల్ని స్వరం, తాళంతో సహా పదలు కూర్చి ఆలపించారు. దాంతో యోగి వ్యతిరేక వర్గం కూడా ఇప్పుడు గొంతు సవరించుకుని తమ డీజే అన్ చేసింది. చూడాలి మరి, ఈ పాటలతో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పడుతోన్న పాట్లు... ఎవరికి ఎన్ని ఓట్లు తెచ్చి పెడతాయో... 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International