అన్నయ్య అని ఆదరిస్తే అత్యాచారం చేశాడు.. ఎవరికీ చెప్పలేదనే భరోసాతో మరోసారి ప్రయత్నించాడు.. చివరకు..

ABN , First Publish Date - 2022-02-20T17:56:03+05:30 IST

ఆ 19 ఏళ్ల యువతి తన పక్కింట్లో ఉండే యువకుడితో సరదాగా మాట్లాడుతుండేది.

అన్నయ్య అని ఆదరిస్తే అత్యాచారం చేశాడు.. ఎవరికీ చెప్పలేదనే భరోసాతో మరోసారి ప్రయత్నించాడు.. చివరకు..

ఆ 19 ఏళ్ల యువతి తన పక్కింట్లో ఉండే యువకుడితో సరదాగా మాట్లాడుతుండేది.. అన్నయ్యా అని పిలుస్తూ ఆదరించేది.. అయితే ఆ యువకుడు ఆమెను సోదరిలా భావించలేదు.. ఇంట్లో ఎవరూ లేనపుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. పరువు పోతుందని భయపడిన ఆ యువతి ఎవరికీ చెప్పలేదు.. ఆమె ఎవరికీ చెప్పలేదనే భరోసాతో మరోసారి ఆమెను బలాత్కరించాడు.. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


రాజస్థాన్‌లోని ధోలాపూర్‌కు చెందిన ఘనశ్యామ్ చాహర్ అనే వ్యక్తి తన పక్కింట్లో ఉండే 19 ఏళ్ల యువతిపై కన్నేశాడు. ఆమె అన్నయ్యా అని పిలుస్తున్నా సరే అతను తన దృష్టి మార్చుకోలేదు. గత నెలలో ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఆ యువతి ఎవరికీ చెప్పలేదు. సైలెంట్‌గా ఉండిపోయింది. దానిని అలుసుగా తీసుకున్న ఘనశ్యామ్ ఈ నెల 18వ తేదీన మరోసారి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 


ఈ సారి ఆమె ఊరుకోలేదు. తల్లిదండ్రులకు మొత్తం విషయం చెప్పేసింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విషయం తెలుసుకున్న నిందితుడు ఊరు నుంచి పరారయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-02-20T17:56:03+05:30 IST