Nellore: ఏఆర్‌హెడ్ క్వార్టర్స్ వద్ద గందరగోళం

ABN , First Publish Date - 2022-04-09T16:25:00+05:30 IST

జిల్లాలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ వద్ద గందరగోళం నెలకొంది.

Nellore: ఏఆర్‌హెడ్ క్వార్టర్స్ వద్ద గందరగోళం

నెల్లూరు:  జిల్లాలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ వద్ద గందరగోళం నెలకొంది. బదిలీల్లో‌ భారీ అక్రమాలు జరిగాయంటూ ఏఆర్ పోలీసులు, హెచ్‌సీలు శనివారం ఆందోళనకు దిగారు. ఎస్పీ, ఏఎస్పీల వద్ద పనిచేసేవారు, ముడుపులు ఇచ్చిన వారిని నెల్లూరు జిల్లాలోనే ఉంచారని ఆరోపించారు. నిబంధనలు పాటించకుండా తిరుపతి జిల్లాకు బదిలీ చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడిగా వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తామని పోలీసులు కన్నీటిపర్యంతమవుతున్నారు. 

Updated Date - 2022-04-09T16:25:00+05:30 IST