Nellore: బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనిల్

ABN , First Publish Date - 2022-04-16T18:42:07+05:30 IST

నగరంలోని గాంధీ బొమ్మ వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు.

Nellore: బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనిల్

నెల్లూరు: నగరంలోని గాంధీ బొమ్మ వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బలప్రదర్శన కోసం తాను సమావేశం నిర్వహించడం లేదన్నారు. ఇది ఎవరికీ పోటీ సభ కాదని స్పష్టం చేశారు. మూడు రోజుల ముందే సభకు అనుమతి కోసం దరఖాస్తు చేశానని... కొందరు దీనిని వివాదంగా మారుస్తున్నారని తెలిపారు. సమావేశం వాయిదా వేసుకోవాలని అధిష్టానం సూచించలేదని చెప్పారు. ఎవరో కార్యక్రమం పెట్టారని సభ పెట్టలేదని అనిల్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-16T18:42:07+05:30 IST