నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల నిరసన

ABN , First Publish Date - 2022-04-16T18:19:53+05:30 IST

జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసనకు దిగారు. జిల్లా కోర్టులో జరిగిన దొంగతనంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల నిరసన

నెల్లూరు: జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసనకు దిగారు. జిల్లా కోర్టులో జరిగిన దొంగతనంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థను కాపాడాలని,  దోషులను తొందరగా పట్టుకోవాలని న్యాయవాదులు పట్టుబట్టారు. దొంగల బారి నుండి న్యాయస్థానాలను రక్షించాలంటూ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. 


Updated Date - 2022-04-16T18:19:53+05:30 IST