Nellore: ఇంటర్ విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది

ABN , First Publish Date - 2022-03-21T14:56:20+05:30 IST

జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో దారుణం జరిగింది.

Nellore: ఇంటర్ విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది

నెల్లూరు: జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో దారుణం జరిగింది. కాలేజిమిట్ట ప్రాంతంలో ఇంటర్ విద్యార్థి జ్యోతిపై ప్రేమోన్మాది చెంచుకృష్ణ కత్తితో దాడి చేశాడు. జ్యోతి గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. తనను ప్రేమించలేదని కోపంతో జ్యోతిపై చెంచుకృష్ణ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జ్యోతి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-21T14:56:20+05:30 IST