Nellore: హత్యాయత్నానికి దారి తీసిన ప్రేమ వ్యవహారం

ABN , First Publish Date - 2022-03-22T15:43:08+05:30 IST

జిల్లాలోని ఆత్మకూరులో ప్రేమ వ్యవహారం హత్యాయత్నానికి దారి తీసింది.

Nellore: హత్యాయత్నానికి దారి తీసిన ప్రేమ వ్యవహారం

నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరులో ప్రేమ వ్యవహారం హత్యాయత్నానికి  దారి తీసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నజీర్, ఆసిఫా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి అంగీకరించని పెద్దలు... అసిఫాకి కావలికి చెందిన మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. అంతేకాకుండా నజీర్‌ను పిలిపించిన  ఆసిఫా కుటుంబం...అతడిని కారుతో ఢీ కొట్టించింది. ఈ ప్రమాదంలో నజీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.  వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కారుతో ఢీ కొట్టిన ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-22T15:43:08+05:30 IST