నెల్లూరు: నగరంలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది. కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నా కనికరం లేదని మండిపడ్డారు. రైతుల సమస్యలపై త్వరలో పాదయాత్రకు శ్రీకారం చుడతామని సోమువీర్రాజు తెలిపారు.
ఇవి కూడా చదవండి