Nellore: వెల వెల బోయిన సీఎం ఆత్మీయ అభినందన సభ

ABN , First Publish Date - 2022-07-26T02:59:37+05:30 IST

కస్తూర్భా కళాక్షేత్రంలో నిర్వహించిన సీఎం ఆత్మీయ అభినందన సభ (Atmiya Abhinandan Sabha) వెలవెలబోయింది. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులను...

Nellore: వెల వెల బోయిన సీఎం ఆత్మీయ అభినందన సభ

నెల్లూరు (Nellore): కస్తూర్భా కళాక్షేత్రంలో నిర్వహించిన సీఎం ఆత్మీయ అభినందన సభ (Atmiya Abhinandan Sabha) వెలవెలబోయింది. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సభ ఏర్పాటు చేశారు. జిల్లాలో సుమారు 5 వేల 500కి పైగా సిబ్బంది ఉండగా 500 మంది సిబ్బంది కూడా హాజరుకాలేదు. వసతి గృహాల నుంచి విద్యార్థులను తరలించినా..హాలు నిండలేదు. ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించినా నమ్మకం లేకనే సీఎం ఆత్మీయ అభినందన హాజరుకాలేదనే చర్చలు సాగాయి. 


ఇటీవల సీఎం సభలకు కూడా జనాలు హాజరుకావడంలేదు.. ఒక వేళ వచ్చినా చివరి వరకూ ఉండటం లేదు. తమది పేదల ప్రభుత్వమని చెబుతున్నా.. కార్యక్రమాలకు మాత్రం ఆశించిన జనాలు రావడంలేదు. ఇటీవల కర్నూలు, విశాఖ, తిరుపతిలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాల నుంచి ప్రజలు వెళ్లిపోయారు. వైసీపీ నేతలు... జనాలను భారీగా సేకరించినా..  నేతల ప్రసంగాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సభ మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు. మరోవైపు ప్రతిపక్ష సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

Updated Date - 2022-07-26T02:59:37+05:30 IST