నెల్లూరు కోర్టులో చోరీ కేసులో రోజుకో కీలక మలుపు

ABN , First Publish Date - 2022-04-27T15:57:52+05:30 IST

నెల్లూరు కోర్టులో చోరీ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది.

నెల్లూరు కోర్టులో చోరీ కేసులో రోజుకో కీలక మలుపు

నెల్లూరు: కోర్టులో చోరీ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. అనుమానాల నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే అవకాశముంది. కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించడంతో నెల్లూరు జిల్లా పోలీసులు.. కోర్టు విధుల్లో ఉన్న పలువురు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మంత్రి కాకాణీ కేసుకు సంబంధించిన ఫైల్స్ మాత్రమే చోరీ కావడం సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫోర్జరీ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, డీజీపీ తదితరులను హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ముగ్గురితోపాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. చోరీ విషయంలో వాస్తవాలు బయటకు రావాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని నెల్లూరు పీడీజే కోరిన విషయాన్ని గుర్తుచేసింది.

Updated Date - 2022-04-27T15:57:52+05:30 IST