బ్రతికున్న బాలుడు చనిపోయినట్టుగా రికార్డుల్లో చూపించిన అధికారులు

ABN , First Publish Date - 2021-07-30T20:09:05+05:30 IST

రేషన్ కార్డులో పిల్లాడు పేరు నమోదు కోసం అధికారుల చుట్టూ తిరిగారు. చివరికి వారు...

బ్రతికున్న బాలుడు చనిపోయినట్టుగా రికార్డుల్లో చూపించిన అధికారులు

నెల్లూరు జిల్లా: రేషన్ కార్డులో పిల్లాడు పేరు నమోదు కోసం అధికారుల చుట్టూ తిరిగారు. చివరికి వారు చెప్పిన సమాధానం విని బాధితులు అవాక్కయ్యారు. బతికున్న బాలుడు చనిపోయాడని రికార్డుల్లో నమోదు చేశారు. అధికారులు చేసిన ఈ నిర్వాకం నెల్లూరు జిల్లా, సంగం మండలంలో జరిగింది. తిరమనతిప్ప గ్రామానికి చెందిన రత్నమ్మ, పెంచలయ్య కుమారుడు ప్రతాప్ పేరు రేషన్ కార్డులో నమోదు కోసం కొంతకాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రతాప్ చనిపోయినట్టుగా రికార్డులో ఉందని అధికారులు చెప్పడంతో పెంచలయ్యకు దిమ్మతిరిగింది.


తన కుమారుడు చనిపోయినట్టుగా చూపించడమేంటని పెంచలయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేనేత కుటుంబానికి చెందిన ఆయన కుటుంబం మగ్గంపై ఆధారపడి జీవిస్తోంది. అధికారుల నిర్వాకానికి మగ్గంపని నిలుపుకుని రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. తన కొడుకు పేరు రికార్డుల్లో నమోదు చేయాలని వేడుకుంటున్నాడు.

Updated Date - 2021-07-30T20:09:05+05:30 IST