Nellore: యధేచ్ఛగా YCP ఎన్నికల కోడ్ ఉల్లంఘన

ABN , First Publish Date - 2022-06-21T20:39:01+05:30 IST

ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో వైసీపీ యధేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోంది.

Nellore: యధేచ్ఛగా YCP ఎన్నికల కోడ్ ఉల్లంఘన

Nellore జిల్లా: ఆత్మకూరు (Atmakuru) ఉప ఎన్నిక ప్రచారంలో వైసీపీ (YCP) యధేచ్ఛగా ఎన్నికల కోడ్‌ (Election Code‌)ను ఉల్లంఘిస్తోంది. మర్రిపాడు మండలం, నందవరం గ్రామంలోని గ్రామ సచివాలయ కార్యాలయంలో వైసీపీ నాయకులు బహిరంగ సభ నిర్వహించారు. వైసీపీకే ఓటు వేయాలని గ్రామ ప్రజలచే స్థానిక వైసీపీ నాయకులు ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అక్కడున్న అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం.


కాగా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారం (By-election) మంగళవారంతో ముగియనుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయనప్పటికీ వైసీపీ (YCP) నానా హైరానా పడుతోంది. లక్ష ఓట్ల మెజారిటీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ నేతలు వాలంటీర్ల ద్వారా ఒక్కో ఓటరకు రూ. 5 వందల నుంచి రూ. 2వేల వరకు పంపిణీ చేస్తోంది. వైసీపీ డబ్బుల పంపిణీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా మేకపాటి విక్రమ్ రెడ్డి (Vikram Reddy) బరిలో ఉన్నారు. గత సంప్రదాయం ప్రకారం టీడీపీ అభ్యర్థిని పోటీలో నిలపలేదు. విక్రమ్ రెడ్డిపై బీజేపీ, బీఎస్పీ సహా పలు పార్టీలు, స్వతంత్ర్య అభ్యర్థులు కలిపి మొత్తం 13 మంది పోటీలో ఉన్నారు. లక్ష మెజారిటీ కోసం వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకున్నా.. మెజారిటీ సాధించడం అధికార వైసీపీకి కష్టంగా మారింది. దీంతో వైసీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రారంభించారు. ఖచ్చితంగా ఓట్లు పడతాయన్న ప్రాంతాల్లో రూ. 5 వందలు, మరికొన్ని చోట్ల వెయ్యి, 15 వందలు పంపిణీ చేస్తున్నారు. బాగా క్లిష్టంగా ఉన్న చోట్ల ఓటుకు రూ. 2వేలు ఇస్తున్నారు. వైసీపీ నేతలు, వాలంటీర్ల ద్వారా బహిరంగంగా డబ్బుల పంపిణీ చేపడుతున్నారు. మరోవైపు వైసీపీ నేతల డబ్బుల పంపిణీని అధికారులు పట్టించుకోవడం లేదు.

Updated Date - 2022-06-21T20:39:01+05:30 IST